Homeక్రీడలుతెరపైకి సిక్సుల వీరుడు యువరాజ్ జీవితం... బయోపిక్‌లో క్రికెట్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!

తెరపైకి సిక్సుల వీరుడు యువరాజ్ జీవితం… బయోపిక్‌లో క్రికెట్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!


భారతీయ క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక సంచలనం. ఆరు సిక్సర్లు… అది ఒకటంటే ఒక్క ఓవర్‌లో… ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ యువరాజ్ సింగ్! ఇప్పుడు ఆయన జీవితం మీద సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు ఆ సినిమాను అనౌన్స్ చేశారు.

టైటిల్ వెల్లడించలేదు కానీ… నిర్మాతలు రెడీ!
యువరాజ్ సింగ్ బయోపిక్ టైటిల్ ఇంకా వెల్లడించలేదు. కానీ, అతని జీవితం మీద సినిమా తీస్తున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, మరొక నిర్మాత రవి భాగ్ చందక వెల్లడించారు. రణబీర్ కపూర్ ‘యానిమల్’, షాహిద్ కపూర్ ‘కబీర్ సింగ్’, అజయ్ దేవగన్ ‘తానాజీ’, ప్రభాస్ ‘సాహో’ తదితర సినిమాల్లో టీ సిరీస్ నిర్మాణ భాగస్వామి. ఆ సంస్థలో యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కుతుండడంతో అటు క్రికెట్ ప్రేమికులు, ఇటు సినిమా అభిమానులలో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇందులో హీరో ఎవరు? ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది ఇంకా వెల్లడించలేదు.

Also Read: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వేణు స్వామి… మహిళా కమిషన్‌లో ఫిర్యాదు వల్లనే జర్నలిస్టులపై ఆరోపణలా?

మాస్టర్ బ్లాస్టర్, ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం మీద తెరకెక్కించిన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ డాక్యుమెంటరీ నిర్మాణంలో రవి భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు మరొక క్రికెటర్ యువరాజ్ సింగ్ జీవితాన్ని తెరపైకి తీసుకు రావడంలో కృషి చేస్తున్నారు. 

యువరాజ్ సింగ్ జీవితం అంటే క్రికెట్ ఒక్కటే కాదు!
పదమూడేళ్ల వయసులో పంజాబ్ అండర్ 16 క్రికెట్ జట్టకు యువరాజ్ సింగ్ ఎంపిక అయ్యారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో అండర్ 19 వరల్డ్ కప్ కూడా ఆడారు. అందులో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు యువరాజ్ అందుకున్నారు. ఆ తర్వాత టీమ్ ఇండియా జట్టుకు ఎంపిక అయ్యారు. ఇక 2007 టీ 20 వరల్డ్ కప్ విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించారు. ఒకే ఓవర్లో ఆయన కొట్టిన ఆరు సిక్సులు ఎప్పటికీ క్రికెట్ అభిమానులు అందరికీ గుర్తే. 

Also Read: సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరొక హీరో – అన్నయ్య కొడుక్కి అండగా మహేష్!


యువరాజ్ అంటే క్రికెట్ ఒకటే కాదు… జీవిత పోరాటం! ఆయనకు 2011లో క్యాన్సర్ ఉందని తెలిసింది.‌ దానిపై పోరాటం చేయడమే కాదు, క్యాన్సర్ నుంచి కోలుకొని మళ్ళీ మైదానంలో అడుగుపెట్టారు. ఐపీఎల్ ఆడారు‌. 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. బ్రిటిష్ మోడల్, బాలీవుడ్ సినిమాల్లో నటించిన, ‘బిగ్ బాస్ 7’లో పార్టిసిపేట్ చేసిన హాజల్ కీచ్, యువరాజ్ 2016లో పెళ్లి చేసుకున్నారు.

Also Readఒకే వేదికపైకి అల్లు అర్జున్ – సుకుమార్… మారుతి నగర్ ఈవెంట్‌లో ‘పుష్ప 2’ పుకార్లకు చెక్!?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments