Let Yashasvi play, do not over-hype achievements said by Gambhir: వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి(Yashasvi Jaiswal) డబుల్ సెంచరీ సాధించాడు. నిన్నటి ఫామ్‌ను కొనసాగించిన యశస్వి ద్వి శతకాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. సిక్సర్‌తో సెంచరీని అందుకున్న యశస్వి జైస్వాల్… ఫోర్‌తో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. తక్కువ వయసులో ద్వి శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. యశస్వి కంటే ముందు వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ ఈ రికార్డును నమోదు చేశారు. అయితే యశస్వి జైస్వాల్ ఆటతీరు గురించి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు.
గంభీర్ ఏమన్నాడంటే….
జైస్వాల్‌ను తన ఆట తనను ఆడుకోనివ్వాలని.. ఘనతలను ఎక్కువ చేసి చూపించడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని గంభీర్ హెచ్చరించాడు. జైస్వాల్‌ను తన ఆట తనను ఆడుకోనివ్వాలని.. లేకపోతే ఒత్తిడి పెరిగి సహజత్వం దెబ్బ తింటుందని గంభీర్ అన్నాడు. గతంలో మీడియా కొందరి ఘనతలను ఎక్కువ చేసి చూపించిందని… వారికి ట్యాగ్‌లు ఇచ్చి ఒత్తిడి పెంచిందని. దీంతో అంచనాలను అందుకోలేక కెరీర్‌లు ఇబ్బందుల్లో పడ్డాయని ఈ లెఫ్ట్‌హ్యాండర్ బ్యాటర్ గుర్తు చేశాడు. రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బాగానే ఆరంభించినా పెద్ద స్కోర్లు చేయలేకపోయారని.. వారు గాడిలో పడటానికి సమయం పడుతుందని పేర్కొన్నాడు. శుభ్‌మన్, శ్రేయస్‌లకు మరింత సమయం ఇవ్వాలన్నాడు.
యశస్వి పేరిట అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన జైస్వాల్.. భారత్ తరఫున టెస్ట్‌ల్లో సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్న 16వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సిక్సర్‌తో సెంచరీ మార్కును తొలుత పాలీ ఉమ్రిగర్ అందుకోగా.. అత్యధిక సార్లు ఈ ఘనతను సాధించిన బ్యాటర్‌గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ ఏకంగా ఆరు సార్లు సిక్సర్‌తో సెంచరీ మార్కును అందుకున్నాడు. సచిన్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు సార్లు ఇలా సెంచరీ మార్కును తాకాడు. మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తలో రెండు సార్లు సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేశారు. హర్భజన్ సింగ్, అశ్విన్ కూడా సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేశారు. వీరిద్దరూ తలో సారి ఇలా సెంచరీ మార్కును అందుకున్నారు. కపిల్ దేవ్, మొహమ్మద్ అజారుద్దీన్, రాహల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎంఎస్ ధోని, పుజారా ఉన్నారు. సిక్సర్‌తో సెంచరీ మార్కును ఓసారి తాకిన సెహ్వాగ్.. డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ మార్కును కూడా సిక్సర్‌తో చేరుకుని చరిత్రపుటల్లోకెక్కాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లి ఈ ఘనత సాధించారు.