Homeక్రీడలుక్షీణించిన కాంబ్లీ ఆరోగ్యం.. థానే హాస్పిటల్లో చేరిక, ప్రస్తుతం తన ఆరోగ్యం ఎలా ఉందంటే..?

క్షీణించిన కాంబ్లీ ఆరోగ్యం.. థానే హాస్పిటల్లో చేరిక, ప్రస్తుతం తన ఆరోగ్యం ఎలా ఉందంటే..?


Vinod Kambli Health Condition : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య క్షీణీస్తోంది. ప్రస్తుతం తనను థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతని ఆరోగ్యం ప్రస్తుతం కుదురుగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడిన కాంబ్లీ.. తాజాగా మళ్లీ ఆరోగ్యం దెబ్బతింది. కాంబ్లీ హాస్పిటల్లో చేరిన క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ వీడియోల్లో తాను బాగానే ఉన్నట్లు థంప్సప్ సింబల్ చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తనను పరామర్శించాడు.  మరోవైపు ఇటీవలే కోచ్ రామకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమం కోసం ఇటీవల సచిన్, కాంబ్లీ ఒకే వేదికను పంచుకున్నారు. అయితే కనీసం లేచి నిలబడలేని స్థితిలో కాంబ్లీ కనిపించడం అభిమానులకు షాక్ కు గురి చేసింది. బీసీసీఐ మాజీ క్రికెటర్లకు ఇచ్చే రూ.30 వేల పెన్షన్ పైనే బతుకు వెళ్ల దీస్తున్నట్లు వివరించాడు. అయితే కాంబ్లీ దీన స్థితిపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. 

సాయానికి సిద్దం..
కాంబ్లీకి సాయం చేసేందుకు 1983 గెలిచిన భారత జట్టు సభ్యులంతా సిద్ధంగా ఉన్నామని, అయితే కాంబ్లీ ఒక షరతుకు ఒప్పుకోవాలని కపిల్ సూచించాడు. వెంటనే అతను రిహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లాలని కోరాడు. తాగుడు వ్యసనానికి బానిస కావడంతో కాంబ్లీ ఆరోగ్యం క్షీణించిదన్న ప్రచారం ఉంది.  తాజాగా దీనిపై కాంబ్లీ స్పందించాడు. తాను కపిల్ పెట్టిన షరతు ప్రకారం రిహబిలిటేషన్ సెంటర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాని తెలిపాడు. ఇటీవల తన ఆరోగ్యం చాలా పాడైపోయిందని, తన భార్య దగ్గరుండి మరీ చూసుకుంటుందని వివరించాడు. ఇప్పటికే మూడు ఆస్పత్రులకు తనను తీసుకెళ్లిందని, మూత్రం ఆగకపోవడమనే సమస్యను తను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాడు. తన కుమారుడు క్రిస్టియానో, పదేళ్ల కూతురు నిత్యం తనను అంటి పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపాడు. 

చిన్ననాటి మిత్రుడు సచిన్ సాయం..
తన చిన్ననాటి స్నేహితుడు సచిన్ ను తాను గతంలో అపార్థం చేసుకున్నట్లు కాంబ్లీ వెల్లడించాడు. నిజానికి సచిన్ తనకెంతో సాయం చేశాడని, రెండుసార్లు హాస్పిటల్ బిల్లులు కూడా చెల్లించినట్లు తెలిపాడు. ఒకదశలో సచిన్ తన కోసం ఏమీ చేయలేదని నిరాశపడ్డానని, అయితే తనకోసం చేయాల్సిందంతా సచిన్ చేశాడని వివరించాడు. కెరీర్ సమయంలో ఎలా ఆడాలో సచిన్ చెప్పేవాడని గుర్తు చేసుకున్నాడు. తన ప్రొత్సాహం వల్లే జట్టులోకి తొమ్మిది సార్లు కంబ్యాక్ చేసినట్లు వెల్లడించాడు. క్రికెటర్లకు గాయాలు ఆటలో సహజమని, వాటిని తట్టుకుని ముందుకు వెళ్లినవారే నిలబడుతారని పేర్కొన్నాడు. వాంఖడే వేదికగా తను చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ మర్చిపోలేనని కాంబ్లీ తెలిపాడు. ఆ సమయంలో అచ్రేకర్ సర్ తనతో ఉండేవారని, క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ తో పోటీ పడేవాణ్ని అని, ఆ యుద్ధం సరదాగా ఉండేదని చెప్పుకొచ్చాడు. 1991-2000 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కాంబ్లీ.. 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 17 టెస్టుల్లో 54 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందుల నాలుగు సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 227. ఇక 104 వన్డేల్లో 32.59 సగటుతో 2477 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండగా, అత్యధిక స్కోరు 106 కావడం విశేషం. 

Also Read: Ind Vs Aus Test Series: ప్రాక్టీస్ పిచ్ ల లొల్లి.. భారత్‌కు పాతవి, ఆసీస్ కు కొత్తవి కేటాయింపు- అభిమానుల గుస్సా

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments