Homeక్రీడలుకెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌

కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌


WI vs ENG 3rd ODI Alzarri Joseph: బుధవారం వెస్టిండీస్‌ ఇంగ్లండ్ మధ్య మూడో వన్డే జరిగింది. ఇందులో విండీస్‌ 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించిన విజువల్స్ కంటే మ్యాచ్‌ మధ్యలో జరిగిన ఓ గొడవ హైలైట్‌ అయ్యింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 

కెప్టెన్‌తో గొడవవపడ్డ విండీస్ బౌలర్‌ మ్యాచ్‌ జరుగుతుండగానే గ్రౌండ్‌ విడిచిపెట్టి పెవిలియన్‌ చేరుకున్నాడు. ఈ ఇన్సిడెంట్‌ మొత్తం కెమెరామెన్ షూట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది విండీస్ టీం. మూడు ఓవర్లు బాగానే వేశారు. నాల్గో ఓవర్ వేయడానికి విండీస్ బౌలర్‌ అల్జారీ జోసెప్‌ రావడంతో అసలు వివాదం మొదలైంది. 

బౌలింగ్‌కు వచ్చిన అల్జారీ మొదటి బాల్ వేసిన తర్వాత పీల్డింగ్‌ పొజిషన్స్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని కెప్టెన్ షైహోప్‌కు చెప్పాడు. కెప్టెన్ లైట్ తీసుకున్నాడు. ఎలాంటి రన్స్ ఇవ్వకుండా ఒక వికెట్ తీసి న ఓవర్ కంప్లీట్ చేశాడు అల్జారీ. అప్పటి వరకు కెప్టెన్‌పై కోపంతో చాలా వేగంగా ఓవర్ వేసిన అల్జారీ…వెంటనే గ్రౌండ్ విడిచి పెట్టి వెళ్లిపోయాడు. 

సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ రాక 

ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా సడెన్‌గా గ్రౌండ్‌ నుంచి అల్జారీ జోసెఫ్‌ వెళ్లిపోవడంతో అంతా షాక్ అయ్యారు. దీంతో హేడెన్ వాల్ష్‌ను ఫీల్డింగ్‌కు పంపించారు. కాసేపటికి కోపం తగ్గి ఫీల్డ్‌లోకి అల్జారీ జోసెఫ్ వచ్చాడు. బౌలింగ్ కోటా పూర్తి చేశాడు.  

ఇంగ్లండ్‌పై సునాయస విజయం 
ఈ మూడో వన్డేలో ఇంగ్లండ్‌పై విండీస్ చాలా ఈజీగా విజయం సాధించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 263 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ల్ జట్టులో ఓపెన్ ఫిలిప్‌ సాల్ట్‌ 108 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. 

264 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్‌ 43 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేసీ కార్టీ 114 బంతుల్లో 128 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 పోర్లు, 2 సిక్స్‌లు కొట్టాడు. బ్రాండన్ కింగ్ 117 పంతుల్లో 102 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్స్‌, ఒక సిక్స్ ఉంది. 

Also Read: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు

 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments