Homeక్రీడలుఓపెనర్లే ఊదేశారు, జింబాబ్వేపై నాలుగో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ

ఓపెనర్లే ఊదేశారు, జింబాబ్వేపై నాలుగో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ


Ind vs Zimb 4th T20 Highlights | హరారే: ఏదో తొలి టీ20లో జింబాబ్వే సత్తా చాటింది. కానీ ఆపై వరుసగా మూడు టీ20ల్లో టీమిండియాను ఆధిపత్యం చెలాయించింది. మరో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే జింబాబ్వేపై ఐదు టీ20ల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో యంగ్ ఇండియా సత్తా చాటింది. శనివారం జరిగిన నాలుగో టీ20లో జింబాబ్వే జట్టుపై యువ భారత్ జట్టు ఏకంగా పదివికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాను జింబాబ్వే బ్యాటర్లు సమర్థంగానే ఎదుర్కొని బ్యాటింగ్ చేశారు. 63 పరుగుల వరకూ జింబాబ్వే టీమ్ ఒక్క వికెట్టూ కూడా కోల్పోలేదు. ఓపెనర్లు మధువీరే, మరుమణి పర్వాలేదనిపించేలా ఆడారు. దాంతో భారత బౌలర్లు 9 ఓవర్లో తొలి వికెట్ ను దక్కించుకున్నారు. ఆ తర్వాత భారత బౌలర్లు అడపాదడపా జింబాబ్వే బ్యాటర్ల వికెట్లు తీస్తూ వచ్చారు. జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ సికిందర్ రజా రాణిస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 28 బంతులు ఆడిన సికిందర్ రజా 2 ఫోర్లు 3 భారీ సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే టీమ్ 7 వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసి భారత్ కు మోస్తరు టార్గెట్ ఇచ్చింది. భారత బౌలర్లు పేసర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, స్పిన్నర్ రవి బిష్ణోయ్ మినహా మిగిలిన బౌలర్లు తలో వికెట్ పడగొట్టారు. 

153 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ అండగా నిలుస్తూ అద్భుతంగా ఆడారు. యశస్వీ జైశ్వాల్ తన దూకుడుగా ఆడుతూ మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు 2 సిక్సర్లతో జైశ్వాల్ 93 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ సైతం వికెట్ ఇవ్వకుండా జింబాబ్వే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో కెప్టెన్ గిల్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్, జైస్వాల్ రాణించడంతో జింబాబ్వే బౌలర్లకు ఛాన్స్ దొరకలేదు. ఒక్క వికెట్ కోల్పోకుండానే భారత్ 15.2 ఓవర్లలోనే 156 పరుగులు చేసింది. దాంతో 10 వికెట్ల తేడాతో నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. తాజా విజయంతో మరో మ్యాచ్ ఉండగానే 3-1 తేడాతో యువ భారత్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments