Homeక్రీడలుఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? – వేలానికి సమీపిస్తున్న గడువు


IPL 2024: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ ముగిసింది. ఇప్పుడు మరో క్రికెట్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. దేశంలో  IPL 2024 నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చేసింది. క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 2024 మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ మార్చి 11తో ముగియనుంది. ఆ తర్వాత మార్చి మధ్యలో నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్నట్లు.. క్రీడావర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. 

మరోవైపు డిసెంబరులో జరిగే ఐపీఎల్ మినీ వేలంపై అన్ని జట్లు దృష్టి సారించాయి. ఐపీఎల్ పాలకమండలి నిబంధనల ప్రకారం ఈనెల 26లోగా రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ఫ్రాంఛైజీలు విడుదల చేయాల్సి ఉంది. ఫ్రాంచైజీలు ప్లేయర్లను తమ వద్దే అట్టిపెట్టుకోవడం లేదా వదిలేయడం అనేది తేల్చుకోవడానికి  ఈ ఒక్కరోజే సమయం ఉంది. నవంబర్ 26 నాటికి ఆ జాబితాను ఐపీఎల్‌ నిర్వాహకులకు ఆయా ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జట్లు స్టార్‌ ప్లేయర్లనే వదిలేశాయి. డిసెంబర్‌ 19న మెగా వేలం జరగనుంది. డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి భారత్‌ కాకుండా వేరే దేశంలో వేలం నిర్వహిస్తారని తెలుస్తోంది. దుబాయ్‌ వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని సమాచారం. 

ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌ రాబోయే ఐపీఎల్‌ ఎడిషన్‌ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌ కారణాలతో అతడు ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడని సీఎస్కే ప్రకటించింది. అంబటి రాయుడు ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ కావటంతో సీఎస్కే పర్స్ వ్యాల్యూలోకి మరో 6.75 కోట్లు వచ్చి చేరనున్నాయి. సౌతాఫ్రికాకు చెందిన డ్వేన్ ప్రిటోరియస్, సిసాంద మంగళ, న్యూజిలాండ్ పేసర్ కేల్ జేమిసన్‌ను కూడా సీఎస్సే వదులుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 

ఇప్పటికే పలు జట్లు ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా ఆటగాళ్లను స్వాప్ చేసుకున్నాయి. రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ తీసుకోగా.. దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ తీసుకున్నాయి. అవేష్ ఖాన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ ట్రేడింగ్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా, మనీష్ పాండేలను విడుదల చేయగా.. యష్ దయాళ్, దాసున్ షనాక, ఒడియన్ స్మిత్, ప్రదీప్ సాంగ్వాన్, ఉరివ్ పటేల్‌లను వేలంలోకి రిలీజ్ చేస్తున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. హ్యారీ బ్రూక్, శామ్ కరన్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, శార్దూల్ ఠాకూర్ వంటి ప్లేయర్లను సైతం వదిలేసుకోవాలని ఫ్రాంఛైజీలు భావిస్తున్నాయి. ఆండ్రూ రస్సెల్‌ను అట్టిపెట్టుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ యోచిస్తోంది. ప్రపంచకప్‌లో రాణించిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, డారీ మిచెల్ వంటి ప్లేయర్లు వేలంలో అందుబాటులో ఉండనున్నారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments