Homeక్రీడలుఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!

ఇదేం ఆటరా సామీ! రిషభ్‌ పంత్‌ లేకపోతే పరువు పోయేది!



<p>India vs New Zealand &nbsp;3rd Test Highlights | ముంబై: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో స్పిన్నర్లు విజృంభిస్తున్నారు. టెస్టు మూడో రోజు లంచ్ సెషన్ సమయానికే భారత్ 6 వికెట్లు కోల్పోయింది. లంచ్&zwnj; బ్రేక్&zwnj; సమయానికి 6 వికెట్ల నష్టానికి భారత్ 92 పరుగులు చేసింది. విజయానికి మరో 55 పరుగులు కావాలి. ప్రస్తుతం రిషభ్ పంత్ (53), వాషింగ్టన్ సుందర్ (6) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లోనూ కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగిన పంత్ మెరుపు హాఫ్ సెంచరీ చేయడం తెలిసిందే.</p>
<p>171/9 తో మూడో రోజులు ఆట మొదలుపెట్టిన న్యూజిలాండ్ మరో 3 పరుగులు చేసి ఆలౌటైంది. దాంతో 147 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు సరైన ఆరంభం లభించలేదు. వరుస విరామాట్లో వికెట్లు కోల్పోవడంతో ఓ దశలో భారత్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. పిచ్&zwnj; స్పిన్&zwnj;కు సహకరిస్తుండటంతో కివీస్&zwnj; స్పిన్నర్ అజాజ్&zwnj; పటేల్ (4/30) మరోసారి భారత వెన్ను విరిచాడు.&nbsp;</p>
<p>కెప్టెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (1), సర్ఫరాజ్&zwnj; ఖాన్ (1) మరోసారి విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 90 రన్స్ చేసి సెంచరీ చేజార్చుకున్న శుభ్&zwnj;మన్ గిల్ (1) సైతం త్వరగా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి, రెండో ఇన్నింగ్స్ చూస్తే భారత్ కు బ్యాటింగ్ వచ్చా అనే తీరుగా ఆడారని క్రికెట్ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. ఇదివరకే సిరీస్ లో దారుణమైన స్కోర్లకు భారత్ ఆలౌటైనా, తీరు మారలేదని మాజీ విమర్శిస్తున్నారు. స్వల్ప స్కోరును ఛేదించడంతో అంత తొందరెందుకు, ఆడుతున్నది భారత గడ్డపై అని మరిచిపోయారా అని ఫైర్ అవుతున్నారు.</p>
<p>&nbsp;</p>



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments