అయితే సరిగ్గా ప్లే ఆఫ్ మ్యాచ్‌కు ముందు, ఫిల్ సాల్ట్ IPL నుంచి నిష్క్రమించాడు. టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఇంగ్లిష్ జట్టు పాకిస్థాన్‌తో ఓ సిరీస్‌లో తలపడనుంది. దీని కోసమే ఈ విధ్వంసకర ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ మధ్యలోనే ఐపీఎల్ ను వదిలిపెట్టి స్వదేశానికి వెళ్లిపోయాడు. దీంతో అవకాశం మరోసారి గుర్బాజ్ తలుపు తట్టింది.
“My mother is still recovering in the hospital, I speak to her every day. But I knew my KKR family needed me here once Phil Salt left. So I came back from Afghanistan, and I’m happy to be here. My mother is happy for me too”
– Rahmanullah Gurbaz (After KKR beat SRH to enter… pic.twitter.com/57YGVfhiTX
— KolkataKnightRiders (@KKRiders) May 21, 2024
అయితే అటు కుటుంబం , ఇటు KKR కుటుంబం రెండూ తనకు ముఖ్యమైనవే అని భావించిన గుర్బాజ్ అనారోగ్యంతో ఉన్న తన తల్లి అనుమతితో భారత్ కి వచ్చాడు. వ్యక్తిగత, వృత్తిపరమైన కట్టుబాట్లను బ్యాలెన్స్ చేయడం అనే సవాలును అంగీకరించాడు, తల్లి ఆశీర్వాదం తీసుకొని, IPL 2024లో కొనసాగటానికి వచ్చానని చెబుతూ భావోద్వేగాయానికి గురయ్యాడు. ఇంకా, తన తల్లి ఇంకా ఆసుపత్రిలో ఉన్నారని, తాను ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతున్నానని వెల్లడించాడు. ఒక క్రికెటర్‌గా అవకాశం వచ్చినప్పుడు జట్టుకోసం పోరాడటానికి తనను తాను మానసికంగా సిద్ధం చేసుకున్నానని చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి టాప్‍లో నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్.. ప్లేఆఫ్స్‌లోనూ దూకుడు కొనసాగించి రాయల్ గా ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍పై కోల్‍కతా విజయం సాధించింది. 38 బంతులు మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది శ్రేయస్ అయ్యర్ సేన. దీంతో ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్ చేరింది కేకేఆర్.
160 పరుగుల లక్ష్యాన్ని కోల్‍కతా నైట్‍రైడర్స్ అలవోకగా ఛేదించింది. 13.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 164 పరుగులు చేసి కోల్‍కతా గెలిచింది. కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ , బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఇద్దరు అర్ధ శతకాలతో అజేయంగా నిలిచారు. అంతకు ముందు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ , సునీల్ నరైన్ కూడా పర్వాలేదనిపించారు. మొత్తానికి సునామీ హిట్టింగ్‍తో అదరగొట్టే ఆటతో కోల్‌కతా ఫైనల్ లోకి దూసుకుపోయింది.
మరిన్ని చూడండి