Homeక్రీడలుఅర్జున అవార్డు అందుకున్న తెలుగు ప్లేయర్లు.. కన్నుల పండుగగా క్రీడా అవార్డుల ప్రదాన కార్యక్రమం

అర్జున అవార్డు అందుకున్న తెలుగు ప్లేయర్లు.. కన్నుల పండుగగా క్రీడా అవార్డుల ప్రదాన కార్యక్రమం


Sports Awards Ceremony Held At Rashtrapati Bhavan: క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను అందించే ప్రముఖ అవార్డులను శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు అందించారు. ప్రతిష్టాత్మక మేజర్ ధాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుతోపాటు ద్రోణాచార్య, అర్జున అవార్డులను విశేష ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అందజేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ప్రవాసాంధ్రుడు, చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్, , పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, భారత పురుషుల జట్టు హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడల్ షూటర్ మానూ భాకర్ లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు ప్లేయర్లలో అథ్లెటిక్స్ కు చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి, అథ్లెట్ జ్యోతి యర్రాజీలకు అవార్డులు దక్కాయి. వీరితోపాటు మరో 32 మంది అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య అవార్డులు అందుకున్నారు. లైఫ్ టైం విభాగంలో మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మాండ్ ఆగ్నెలో కొలాకో (ఫుట్బాల్)లకు పురస్కారాలు దక్కాయి. 

అర్జున అవార్డులు దక్కించుకున్న ప్లేయర్లు..
యర్రాజి జ్యోతి, అన్నురాణి(అథ్లెటిక్స్), నీతు సావీటీ బూరా(బాక్సింగ్), వంతిక అగర్వాల్(చెస్), సలీమా టెటె, అభిషేక్, సంజయ్, జర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్(హాకీ), రాకేశ్ కుమార్(పారా ఆర్చరీ), జీవాంజి దీప్తి, ప్రీతి పాల్, అజీత్ సింగ్, సచిన్ సార్జేరావ్ ఖిలారి, ధరమ్ బీర్, ప్రణవ్ సూర్మా, హొకాటో సేమా, సిమ్రన్, నవదీప్(పారా అథ్లెటిక్స్), నితీష్ కుమార్, తులసిమతి మురుగేశన్, నిత్యశ్రీ సుమతి శివన్, మనీషా రాందాస్(పారా బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్, మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్, స్వప్నిల్, అభయ్ సింగ్, అమన్ సెహ్రావత్(రెజ్లింగ్), మురళీకాంత్ రాాజరాం పెట్కార్ (లైఫ్ టైం, పారా స్విమ్మర్)

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న:
దొమ్మరాజు గుకేశ్(చెస్), హర్మన్‌ప్రీత్ సింగ్(హాకీ), ప్రవీణ్ కుమార్(పారా అథ్లెటిక్స్), మను భాకర్(షూటింగ్)

ద్రోణా చార్య:
సుభాష్ రాణా(పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే(షూటింగ్), సందీప్ సాంగ్వాన్(హాకీ)   

Also Read: Kohli In Ranji Trophy: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రంజీల్లో బరిలోకి కోహ్లీ.. ఆ తేది నుంచి మైదానంలోకి రన్ మేషిన్

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments