Homeక్రీడలుఅబుధాబి టీ10 లీగ్ లో ఫిక్సింగ్ కలకలం? ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ

అబుధాబి టీ10 లీగ్ లో ఫిక్సింగ్ కలకలం? ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ


Match fixing in T10 league: క్రికెట్ లో ధనాధన్ ఆటతీరును పెంపొందించింది టీ20 క్రికెట్. ఈ ఫార్మాట్ వచ్చాకే ఐపీఎల్ లాంటి కళ్లు చెదిరే టోర్నీలతోపాటు ఏబీ డివిలియర్స్, సూర్య కుమార్ యాదవ్ లాంటి 360 డిగ్రీల ఆటగాళ్లు కొత్తగా షాట్లను వాడుకలోకి తెచ్చారు. అయితే టీ20లనే తలదన్నే అల్ట్రా ప్రో మ్యాక్స్ తరహాలో ధనాధన్ ఆటతీరుతో టీ10 ప్రేక్షకుల మతులను పోగుడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి టోర్నీలు చాలానే ఉన్నప్పటికీ అబుధాబి టీ10 లీగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా ప్రేక్షకులను అలరిస్తున్న అబుధాబి టీ10 లీగ్ ఫిక్సింగ్ బారిన పడిందన్న వార్తలు అభిమానులను కలవరపరుస్తున్నాయి.

తాజాగా ఎమిరేట్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రవర్తన నియామళిని ఉల్లంఘించినందుకుగాను ఒక జట్టు సహాయక కోచ్ సన్నీ థిల్లాన్ పై వేటు పడింది. ఆరేళ్ల పాటు ఎటువంటి క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో పాలుపంచుకోకుడదని ఆదేశించినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే లీగ్ లో తను ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోందన్నది మాత్రం ఐసీసీ తెలుపలేదు. అలాగే థిల్లాన్ ఏ దేశానికి చెందిన ఆటగాడో వెల్లడించలేదు. మరోవైపు గతంలో ఈ లీగ్ లో ఫిక్సింగ్ జరుగుతున్నట్లు కొన్ని క్లిప్పింగ్ లు కొంతమంది ఫ్యాన్స్ షేర్ చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి. 

మ్యాచ్ ల ఫలితాన్ని తారుమారు చేసేందుకు..
నిజానికి ఈ ఫిక్సింగ్ సంఘటన జరిగింది 2021 లీగ్ కి సంబంధించింది కావడం విశేషం. ఈ విషయం గతేడాది వెలుగులోకి వచ్చినప్పటికీ, అప్పటి నుంచి విచారణ జరుగుతోందని సమాచారం. ప్రస్తుత నిషేధం కూడా గతేడాది నుంచి వర్తిస్తుందని ఐసీసీ తెలిపింది. జట్టుకు సంబంధించిన వివరాలను తెలియపర్చడం, ఫలితాలను టాంపర్ చేసేందుకు ప్రయత్నించడం లాంటి తీవ్రమైన నేరాలకు థిల్లాన్ పాల్పడినట్లు విచారణలో తేలింది. అతను ప్రవర్తన నియామవళిలోని ఆర్టికల్ 2.1.1 ఫిక్సింగ్ కి ప్రయత్నించడం, ఆర్టికల్ 2.4.4 అవినీతి నిరోధక కోడ్ లోని విషయాలను ఉల్లంఘించడం, ఆర్టికల్ 2.4.6 ఇన్వెస్టిగేషన్ కి సహకరించకపోవడం తదితర నేరాలకు పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది. 

2023లోనే సస్పెన్షన్.. 
నిజానికి థిల్లాన్ ను ఫిక్సింగ్ ఆరోపణలతో 13 సెప్టెంబర్, 2023లోనే సస్పెండ్ చేశారు. తాజాగా పూర్తి స్థాయి నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారంలో ఎనిమిది పాల్గొన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. పరాగ్ సంఘ్వీ, క్రిష్ణన్ కుమార్ చౌదరీ అనే వ్యక్తుల పేర్లు మాత్రం బహిర్గతమైంది. ప్రస్తుతం వీరిపై విచారణ జరుగుతోంది. 

ఇక 2024 ఎడిషన్ లో డెక్కన్ గ్లాడియేటర్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. జయేద్ క్రికెట్ స్టేడియంలో మోరిస్ విల్లే సాంప్ ఆర్మీ జట్టుతో జరిగిన ఫైనల్లో ఎనిమిది వికెట్లతో గెలుపొందింది. జోస్ బట్లర్ కి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది. 2017లో ప్రారంభమైన ఈ లీగ్ లో ప్రస్తుతం పది జట్టు ఉన్నాయి. ఇప్పటివరకు ఎనిమిది సార్లు నిర్వహించిన టోర్నీలో కేరళ కింగ్స్, నార్తన్ వారియర్స్, మరాఠా అరేబియన్స్, డెక్కన్ గ్లాడియేటర్, న్యూయార్క్ స్ట్రైకర్స్ జట్లు విజేతగా నిలిచాయి. అత్యధికంగా గ్లాడియేటర్స్ జట్టు మూడుసార్లు చాంపియన్ గా నిలిచింది. మరోవైపు ఐపీఎల్ మాదిరిగా ఈ టోర్నీలో జట్లు శాశ్వతంగా ఉండవు. తరచూగా మార్పులకు గురవుతుంటాయి. ఇప్పటివరకు 11 జట్లను ఈ లీగ్ నుంచి తప్పించడం జరిగింది. 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments