Homeఆర్థికంZomato large order fleet: ఒకే సారి పెద్ద ఆర్డర్ల డెలివరీ కోసం 'లార్జ్ ఆర్డర్...

Zomato large order fleet: ఒకే సారి పెద్ద ఆర్డర్ల డెలివరీ కోసం ‘లార్జ్ ఆర్డర్ ఫ్లీట్’ను ప్రవేశపెట్టిన జొమాటో..


50 మంది అతిథుల కోసం..

చిన్న చిన్న పార్టీలు, సమావేశాలు, ఈవెంట్లలో ఫుడ్ డెలివరీ చేయడం లక్ష్యంగా ఈ లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను ప్రారంభించారు. కనీసం 50 మందికి ఈ ఫ్లీట్ ద్వారా ఒకేసారి భోజనం సప్లై చేయవచ్చు. ఇంతకుముందు, జొమాటో (Zomato) బహుళ డెలివరీ ఏజెంట్ల ద్వారా పెద్ద ఆర్డర్లకు ఫుడ్ ను సప్లై చేసేంది. అలా కాకుండా, ఒకేసారి, ఒకే డెలివరీలో ఆర్డర్ చేసిన మొత్తం ఫుడ్ ను అందించడం కోసం లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను స్టార్ట్ చేశారు. అయితే, ఈ కొత్త ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. డెలివరీ కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఫుడ్ ఫ్రెష్ గా ఉండడం కోసం ఉష్ణోగ్రత నియంత్రణతో కూలింగ్ కంపార్ట్మెంట్ లు, హాట్ బాక్స్ లు వంటి మరిన్ని ఫీచర్లను జోడించే పనిలో జొమాటో ఉందని జొమాటో సీఈఓ దీపిందర్ (Zomato CEO Deepinder Goyal) తెలిపారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments