మీరు వోక్స్ వ్యాగన్ టైగన్ ఎస్ యూవీ లేదా విర్టస్ సెడాన్ కొనుగోలు చేయాలనుకుంటే, ఈ డిసెంబర్ ఉత్తమ సమయం కావచ్చు. మోడల్ ను బట్టి ఈ రెండు మోడళ్లపై రూ.2 లక్షల వరకు ఇయర్ ఎండ్ డిస్కౌంట్లను వోక్స్ వ్యాగన్ అందిస్తోంది. వోక్స్ వ్యాగన్ విర్టస్ ప్రారంభ ధర రూ .11.56 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది స్కోడా స్లావియా, హోండా సిటీ , హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి పోటీగా ఉంటుంది. కాంపాక్ట్ సెగ్మెంట్ లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఇతరులకు పోటీగా ఉన్న వోక్స్ వ్యాగన్ టైగన్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ .11.70 లక్షలు (ఎక్స్-షోరూమ్).