ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ విభాగాల్లో వేగవంతమైన వృద్ధితో 2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ తన నష్టాలను 43% తగ్గించుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం పెరిగి రూ.11,247 కోట్లకు చేరింది. ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్, డైనింగ్ వంటి కన్స్యూమర్ ఫేసింగ్ బిజినెస్ లో రూ.35,000 కోట్ల స్థూల ఆర్డర్ విలువ (జీఓవీ) నమోదైంది.