1. భారీ విదేశీ మూలధన ప్రవాహం
విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ పీఐ) దూకుడు అమ్మకాలే మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్లో ఎఫ్పీఐలు రూ.98,000 కోట్లకు పైగా విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనా మార్కెట్ల చౌక వాల్యుయేషన్ కారణంగా, అలాగే, బీజింగ్ ఇటీవల కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించిన నేపథ్యంలో, ఎఫ్పీఐలు తమ నిధులను చైనా స్టాక్స్ లోకి మళ్లిస్తున్నారు. ‘‘ఎఫ్పీఐ అమ్మకాలు అనూహ్యంగా ఉన్నాయి. కోవిడ్-19 సంక్షోభం, ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా వారు ఇంత విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించలేదు. ఈ నెల 24 వరకు రూ.98,085 కోట్లకు చేరిన ఎఫ్ఐఐల భారీ, స్థిరమైన, అపూర్వ అమ్మకాలతో బై-ఆన్-డిప్స్ వ్యూహం పనిచేయడం లేదు’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు.