Small-cap stocks under ₹100: ఎఫ్ ఐఐల అమ్మకాలు, యూఎస్ ఫెడ్ నిర్ణయాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ నాలుగు వారాల విజయ పరంపరకు గతవారం బ్రేక్ పడింది. కీలక బెంచ్ మార్క్ సూచీలు గత వారం అంతకుముందు నాలుగు వారాల లాభాలను చెరిపివేశాయి. నిఫ్టీ 24,768 పాయింట్ల నుంచి 23,587 పాయింట్లకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ గతవారం 4,000 పాయింట్లకు పైగా నష్టంతో 82,133 నుంచి 78,041 స్థాయికి పడిపోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ గతవారం 2,824 పాయింట్ల నష్టంతో 53,583 నుంచి 50,759కు పడిపోయింది. ఈ స్టాక్ మార్కెట్ (stock market) పతనంలో, నిఫ్టీ 50 ఇండెక్స్ దాని 200-డిఇఎ మద్దతు కంటే దిగువకు పడిపోయి, 23,800 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇటీవల కనిష్ట స్థాయి 23,250కి చేరువలో ఉందని, ఈ మద్దతు అంతంతమాత్రంగానే ఉంటుందా లేక కొత్త కనిష్టాన్ని తాకుతుందా అనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.