ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లు
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్తగా రెండు ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లను (mobile recharge plans) తీసుకువచ్చింది. కొత్త ప్లాన్లు కేవలం రూ .39 నుండి ప్రారంభమవుతాయి. కొత్త ప్లాన్లు 7 రోజుల కాలానికి డెడికేటెడ్ నిమిషాలను అందిస్తాయి. ఐఎస్డీ నిమిషాలను ‘అత్యంత సరసమైన ధరలకు’ అందిస్తున్నట్లు జియో పేర్కొంది. బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియాలకు ఈ జియో ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లు వర్తిస్తాయి.