సాంకేతిక పరిజ్ఞానంతో..
జియో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో పెద్ద ఎత్తున అమలు చేస్తోందని, ఆ తర్వాత వాటిని ప్రపంచ దేశాలకు తీసుకెళ్తుందని నివేదిక తెలిపింది. వంద కోట్ల మంది భారతీయులకు ఇళ్లు, కార్యాలయాలు, ప్రయాణాల్లో వారి డిజిటల్ అవసరాలకు సరిపడా డేటా సామర్థ్యాన్ని జియో నిర్మించింది. భారతదేశంలో డేటా ట్రాఫిక్ లో జియో వాటా 60 శాతానికి పెరిగింది. ఇది భారతీయులు అత్యంత ఇష్టపడే బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ గా మారింది” అని రిలయన్స్ జియో తన వార్షిక నివేదికలో తెలిపింది.