ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్ లాంచ్‌కు రెడీ అవుతోంది. స్టాండర్డ్ 3 డోర్ థార్‌కు మార్కెట్లో క్రేజీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొత్త థార్ రాక్స్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మహీంద్రా థార్ రాక్స్ భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) న విడుదల కానుంది. ఈ సంవత్సరం మహీంద్రా నుంచి ఇది అతిపెద్ద లాంచ్ కాబోతోంది. అంతేకాదు ఈ ఏడాది మొత్తంలో మచ్ వైటెడ్ వెహికిల్ లాంచ్‌లలో ఇదొకటి. థార్ రాక్స్ ఎలా ఉంటుంది, ఫీచర్లు, ఇంజిన్ పరంగా ఇది ఏం అందిస్తుంది, మరీ ముఖ్యంగా దాని ధర ఎంత అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో 5 డోర్ థార్ రాక్స్‌ని స్టాండర్డ్ థార్‌తో పోల్చి, కొత్తగా వచ్చే ఐదు ఫీచర్స్పై ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి..