Homeఆర్థికంiVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి...

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..


iVOOMi JeetX ZE electric scooter: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఐవూమీ భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఇది సింగిల్ చార్జ్ తో 170 కిమీలు ప్రయాణిస్తుంది. జీత్ఎక్స్ జెడ్ఈ గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు బ్యాటరీ ప్యాక్ సైజుల్లో లభిస్తుంది. ఇందులో 2.1 కిలోవాట్, 2.5 కిలోవాట్, 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. మే 10 నుంచి ఐవూమీ జీత్ఎక్స్ జెడ్ఈ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే, వీటి డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఐవూమి ఇంకా ప్రకటించలేదు.

సెగ్మెంట్లో చీప్ ప్రైస్..

ఐవూమీ జీత్ఎక్స్ జెడ్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 నుంచి ప్రారంభమౌతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అభివృద్ధి చేయడానికి 18 నెలలు పట్టిందని, లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించామని ఐవూమి తెలిపింది. జీత్ఎక్స్ జెడ్ఈ కి ముందు లాంచ్ అయింది జీత్ఎక్స్ మోడల్. జీత్ఎక్స్ సేల్స్ మూడేళ్ల క్రితమే భారతదేశంలో ప్రారంభమయ్యాయి. 3 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి ఇవి 10 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయి.

విస్తృతమైన కలర్ ఆప్షన్స్

ఇవూమి జీత్ఎక్స్ జెడ్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నార్డో గ్రే, ఇంపీరియల్ రెడ్, అర్బన్ గ్రీన్, పెర్ల్ రోజ్, ప్రీమియం గోల్డ్, సెరులియన్ బ్లూ, మార్నింగ్ సిల్వర్, షాడో బ్రౌన్ కలర్స్ లో లభిస్తుంది. మొత్తం 8 రంగుల్లో తనకు ఇష్టమైన రంగును నుండి కస్టమర్లు ఎంచుకోవచ్చు. కొలతల పరంగా, ఈ స్కూటర్ వీల్ బేస్ 1,350 మిమీ, స్కూటర్ పొడవు 760 మిమీ, సీటు ఎత్తు 770 మిమీగా ఉంటుంది.

బ్లూటూత్ కనెక్టివిటీ

బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయ్యే అప్లికేషన్ తో ఈ స్కూటర్ వస్తుంది. ఇది డిస్టెన్స్ టు ఎంప్టీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి సమాచారాన్ని చూపుతుంది. దీనికి జియో-ఫెన్సింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 9.38 బిహెచ్పీ శక్తిని అందిస్తుంది. ఇందులోని 12 కిలోల బరువున్న ఈ బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ గా ఉంటుంది.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments