Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 100 పెరిగి.. రూ. 56,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,500గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 1,000 పెరిగి, రూ. 5,66,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,660గా కొనసాగుతోంది.