Homeఆర్థికంGold and silver prices today : రూ. 68వేలకు చేరువలో బంగారం ధర! పెరిగిన...

Gold and silver prices today : రూ. 68వేలకు చేరువలో బంగారం ధర! పెరిగిన వెండి రేటు..


Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 67,560కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 67,550గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,75,600కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,756గా కొనసాగుతోంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 73,700కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 73,690గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,37,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,710గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,850గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,560 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 73,700గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,710గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,860గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 67,560గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,700గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,560గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,700గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 67,610గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,750గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,560గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,700గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,780గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 87,800కి చేరింది. శనివారం ఈ ధర రూ. 87,700గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 87,800.. బెంగళూరులో రూ. 87,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 140 పెరిగి.. రూ 26,400కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 26,260గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 26,400గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments