2021 నుంచి..
ఆటోమేటిక్ టోల్ వసూలుతో పాటు టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నిరోధించడానికి ఫిబ్రవరి 15, 2021 నుండి అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) లను తప్పనిసరి చేశారు. ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు లేకుండా వాహనాలు వెళ్లడానికి వీలుగా NHAI ‘ఒక వాహనం, ఒకే ఫాస్ట్‌ట్యాగ్’ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంటే, ఒకే ఫాస్టాగ్ ను ఒకటి కన్నా ఎక్కువ వాహనాలకు వాడకుండా.. అలాగే, ఒకే వాహనానికి ఒకటికి మించిన ఫాస్టాగ్ లను వాడకుండా నిరోధించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.