కార్పొరేట్ సంస్థలును నామినీగా నియమించలేరు. వ్యక్తులను మాత్రమే నామినీ చేయవచ్చు. ఫామ్‌లో ఖాతాదారుడి సంతకంతో పాటు నామినీ పేరు, చిరునామా అవసరం. నామినీ ఐడీ ప్రూఫ్ సమర్పించడం ఆప్షనల్. ఖాతాదారుడు వేలిముద్రను ఉపయోగిస్తే సాక్షి పేరు, సంతకం అవసరం. నామినీ మైనర్ అయితే సంరక్షకుడి పేరు, చిరునామాతో పాటు మైనర్ పుట్టిన తేదీ కూడా అవసరం. నామినీ, సంరక్షకుడు, ఖాతాదారుడు ఒకే వ్యక్తిగా ఉండకూడదు. ఇప్పటికే ఉన్న నామినీని తొలగించడానికి లేదా “ఆప్ట్-అవుట్” ఎంపికను ఎంచుకోవడానికి.. ఖాతాదారుడు నామినేషన్ చేయకూడదనే వారి ఉద్దేశాన్ని తెలియజేస్తూ అదే ఫామ్‌ని పూర్తి చేయాలి.