అధిక వడ్డీ రేట్లను వసూలు చేయకూడదని బ్యాంకులకు ఆర్‌బిఐ జారీ చేసిన సర్క్యూలర్లకు విరుద్దంగా క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు ఉండటం గుర్తించారు. హేతుబద్దమైన వడ్డీరేట్లను మాత్రమే బ్యాంకులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆర్‌బిఐ, బ్యాంకులు, ఫిర్యాదు దారుల వాదనలు విన్న తర్వాత జాతీయ వినియోగదారుల కమిషన్ క్రెడిట్ కార్డు వడ్డీలపై గతంలోనే స్పష్టత ఇచ్చింది. వార్షిక వడ్డీ 36శాతం నుంచి 50శాతం ఉంటే అది అధిక వడ్డీ కిందకు వస్తుందని అభిప్రాయపడింది. క్రెడిట్ కార్డు చెల్లింపులు ద్వారా కొనుగోలు చేసే వస్తువులు, సేవలను అందించినందుకు అయా సంస్థల నుంచి బ్యాంకులు కమిషన్ వసూలు చేస్తుంటాయి. ఈ కమిషన్లు కూడా క్రెడిట్ కార్డుదారుడే ఛెల్లించాల్సి వస్తోంది. వస్తువు, సేవల ధరల్లో కలిపి కమిషన్లను వసూలు చేస్తుండటాన్ని కమిషన్ తప్పు పట్టింది.