Homeఆర్థికంసిద్ధం అవుతున్న ఎలక్ట్రిక్ హ్యుందాయ్ క్రెటా - లాంచ్ ఎప్పుడంటే?

సిద్ధం అవుతున్న ఎలక్ట్రిక్ హ్యుందాయ్ క్రెటా – లాంచ్ ఎప్పుడంటే?


Electric Hyundai Creta: హ్యుందాయ్ చాలా కాలంగా తన ఎలక్ట్రిక్ క్రెటా ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. దీనిని 2025 ప్రారంభంలో విడుదల చేయవచ్చు. ప్రస్తుతం కంపెనీ ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో అయోనిక్ 5, కోనా ఈవీలను విక్రయిస్తోంది. రాబోయే క్రెటా ఈవీకి మార్కెట్లో మంచి స్పందన లభిస్తుందని భావిస్తున్నారు. టెస్టింగ్ మోడల్ దాని కీలక డిజైన్ వివరాలను వెల్లడిస్తుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ… 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ నుంచి కొత్త తరం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించవచ్చని తజా సమాచారం సూచిస్తుంది. ఫ్రంట్ యాక్సిల్‌లో ఇన్‌స్టాల్ చేసిన ఈ మోటార్ 138 బీహెచ్‌పీ పవర్, 255 ఎన్ఎం పీక్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇంజిన్ ఇలా…
మారుతి సుజుకి లాంచ్ చేయనున్న ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని చూసినట్లయితే ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. అది 48 కేడబ్ల్యూహెచ్, 60 కేడబ్ల్యూహెచ్ వేరియంట్లలో రావచ్చు. క్రెటా ఈవీ… ఎంజీ జెడ్ఎస్ ఈవీ కంటే చిన్నదైన బ్యాటరీతో వస్తుందని సమాచారం. ఎంజీ జెడ్ఎస్ ఈవీలో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించనున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ సమయంలో దాని ఎలక్ట్రిక్ రేంజ్‌ను అంచనా వేయడం సరైనది కాదు.

డిజైన్ ఇలా…
దక్షిణ కొరియాలో కనిపించే క్రెటా ఈవీ ప్రోటోటైప్ ఇప్పటికే ఉన్న మోడల్‌తో పోల్చితే కొన్ని మార్పులను పొందుతుంది. ముందు భాగంలో కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌తో పాటు ఫాక్స్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్‌ను కూడా అందించారు. సీ-ఆకారపు ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ప్రస్తుత మోడల్ కంటే చాలా పెద్దవి. క్రెటా ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, ప్రత్యేకమైన కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లు, వెనుక బంపర్ ఉన్నాయి.

ఇంటీరియర్ ఎలా ఉంటుంది?
క్రెటా ఈవీ ఇంటీరియర్ గురించిన వివరాలు ప్రస్తుతం తెలియవు. అయితే 2024 జనవరి 16వ తేదీన షెడ్యూల్ అయిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ సమయంలో దీని గురించి డిటైల్స్ బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇటీవల గుర్తించిన మోడల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గేర్ లివర్‌ను కలిగి ఉంటుందని సూచిస్తుంది. ఇది అయోనిక్ 5లో కూడా కనిపిస్తుంది. ఇది కాకుండా ఎస్‌యూవీ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడా రానుందని తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం త్వరలో వెల్లడి కావచ్చు.

టాటా పంచ్ ఈవీ 2023 డిసెంబర్ 21వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ కానుంది. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ, టియాగో ఈవీ తర్వాత కంపెనీ తన నాలుగో ఎలక్ట్రిక్ కారుగా పంచ్ ఈవీని మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. ఇది సిట్రోయెన్ ఈసీ3, రాబోయే హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఈవీతో పోటీపడుతుంది. టాటా ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ ధర తక్కువగా ఉండనుంది. దీని బేస్ వేరియంట్‌ ధర దాదాపు రూ.10-11 లక్షల మధ్యలో ఉండనుంది. ఇక టాప్ వేరియంట్‌ ధర దాదాపు రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని అంచనా.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే – కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే – బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ – ఈవీ కూడా!



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments