Homeఆర్థికంరూ.78 వేల దగ్గర బంగారం, రూ.99 వేల దగ్గర వెండి - ఈ రోజు బంగారం,...

రూ.78 వేల దగ్గర బంగారం, రూ.99 వేల దగ్గర వెండి – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ


Latest Gold-Silver Prices Today: అమెరికన్‌ డాలర్‌ విలువ కొద్దిగా తగ్గడంతో పాటు ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌ చేపట్టడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు కొద్దిగా పెరిగింది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,640 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో పసిడి రేట్లలో ఎలాంటి మార్పు లేదు. శనివారం నాటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. శనివారం నాడు 24 కేరెట్ల గోల్డ్‌ 10 గ్రాములకు 650 రూపాయలు, ‌22 కేరెట్ల గోల్డ్‌ 600 రూపాయల చొప్పున పెరిగాయి. ఈ రోజు కిలో వెండి ధర 100 రూపాయలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,090 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 98,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,450 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 71,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 58,090 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 98,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **







ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 77,450 ₹ 71,000 ₹ 58,090 ₹ 98,900 
విజయవాడ ₹ 77,450 ₹ 71,000 ₹ 58,090 ₹ 98,900 
విశాఖపట్నం ₹ 77,450 ₹ 71,000 ₹ 58,090 ₹ 98,900 

 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities) 
















ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,100 ₹ 7,745
ముంబయి ₹ 7,100 ₹ 7,745
పుణె ₹ 7,100 ₹ 7,745
దిల్లీ ₹ 7,115 ₹ 7,760
 జైపుర్‌ ₹ 7,115 ₹ 7,760
లఖ్‌నవూ ₹ 7,115 ₹ 7,760
కోల్‌కతా ₹ 7,100 ₹ 7,745
నాగ్‌పుర్‌ ₹ 7,100 ₹ 7,745
బెంగళూరు ₹ 7,100 ₹ 7,745
మైసూరు ₹ 7,100 ₹ 7,745
కేరళ ₹ 7,100 ₹ 7,745
భువనేశ్వర్‌ ₹ 7,100 ₹ 7,745

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Countries) 












దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,820 ₹ 7,370
షార్జా ‍‌(UAE) ₹ 6,820 ₹ 7,370
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,820 ₹ 7,370
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,915 ₹ 7,357
కువైట్‌ ₹ 6,645 ₹ 7,246
మలేసియా ₹ 6,879 ₹ 7,163
సింగపూర్‌ ₹ 6,820 ₹ 7,567
అమెరికా ₹ 6,635 ₹ 7,060

ప్లాటినం ధర (Today’s Platinum Rate)

మన దేశంలో, 10 గ్రాముల ‘ప్లాటినం’ ధర రూ. 240 పెరిగి రూ. 25,500 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments