Crorepati Tips For Middle Class: మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, ఓ మోస్తరు జీతం కోసం ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు తమ పదవీ విరమణ నాటికి కోట్ల రూపాయల విలువైన ఫండ్ (Retirement Corpus) సృష్టించడం చాలా కష్టం. వాళ్లకు వచ్చే పరిమిత ఆదాయం, అపరిమిత కష్టాలు దీనికి కారణం. అయితే.. కోట్ల విలువైన రిటైర్మెంట్ కార్పస్‌ను సృష్టించడం కష్టమే గానీ అసాధ్యం మాత్రం కాదు. మీరు కూడా ఇదే వర్గానికి చెందితే… పెట్టుబడి & పొదుపు కోసం మెరుగైన వ్యూహాన్ని సిద్ధం చేయగలిగితే, పదవీ విరమణ ద్వారా కోట్ల విలువైన కార్పస్‌ను సృష్టించడం కష్టమైన పని కాదని మీకు అర్ధం అవుతుంది.
కోట్ల విలువైన ఫండ్ అంటే ఒక కోటి లేదా రెండు కోట్ల రూపాయలు కాదు, పక్కా ప్లానింగ్‌తో ముందడుగు వేస్తే మీరు రూ. 50 కోట్ల వరకు కార్పస్ క్రియేట్ చేయవచ్చు.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి వయస్సు 23 సంవత్సరాలు అనుకుందాం. అతనికి ఈ ఏడాదే ఉద్యోగం వచ్చిందని భావిద్దాం. అతను, పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల వయస్సు వరకు పని చేస్తాడనుకుంటే, ఇప్పటి నుంచి మరో 37 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండాలి. ఇప్పుడు ఆ వ్యక్తి జీతం నెలకు రూ.60 వేలు అనుకుందాం. ఈ పరిస్థితిలో, అతను తన కుటుంబ అవసరాల కోసం నెలకు రూ. 38 వేలు ఖర్చు పెట్టి, మిగిలిన రూ. 22 వేలను క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds)లో పెట్టుబడిగా పెడితే, 12 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR)తో, తన 60 ఏళ్ల వయస్సు నాటికి రూ. 50 కోట్లు సంపాదించాలన్న లక్ష్యాన్ని చాలా సులభంగా చేరుకోవచ్చు.
10 సంవత్సరాల తర్వాత…
మ్యూచువల్ ఫండ్ SIPలో నెలకు రూ. 22 వేలు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, ఏడాదికి పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షల 64 వేలు అవుతుంది. 17 శాతం కాంపౌండ్ గ్రోత్ ఆధారంగా, ఆ మొత్తం ఫండ్ ఏడాదిలో రూ. 2 లక్షల 81 వేలు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత, కనీస జీతం పెరుగుదల ఆధారంగా, ప్రతి నెలా SIPలో రూ. 51,875 డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా, కాంపౌండింగ్ తర్వాత, అతని ఫండ్ మొత్తం రూ. 74 లక్షల 23 వేలు అవుతుంది.
20 ఏళ్ల తర్వాత…
20 సంవత్సరాల తర్వాత నెలవారీ SIP రూ. 1,34,550కు మారుతుంది. ఆ సమయానికి ఆ మొత్తం ఫండ్ రూ. 4 కోట్ల 37 లక్షలకు చేరుకుంటుంది.
30 ఏళ్ల తర్వాత…
పెరుగుతున్న జీతం ప్రకారం, ఆ వ్యక్తి SIP వాటాను పెంచుకుంటూ వెళ్తే, 30 సంవత్సరాల తర్వాత నెలవారీ SIP రూ. 3 లక్షల 48 వేలుగా మారుతుంది. 37 ఏళ్ల తర్వాత, అంటే అతనికి 60 ఏళ్లు పూర్తయ్యే నాటికి (పదవీ విరమణ సమయంలో) SIPలో నెలవారీ సహకారం రూ. 6 లక్షల 80 వేలు అవుతుంది. అదే విధంగా ఫండ్ మొత్తం రూ. 51 కోట్లు దాటుతుంది.
స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏబీపీ దేశం పెట్టుబడి సలహాలు ఇవ్వదు. మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, నిపుణుడి సలహా తీసుకోవడం మంచింది.
మరో ఆసక్తికర కథనం: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?