Homeఆర్థికంమీరూ రైల్వేస్టేషన్‌లో షాప్‌ పెట్టుకొని డబ్బులు సంపాదించవచ్చు- ఇలా అప్లై చేయండి

మీరూ రైల్వేస్టేషన్‌లో షాప్‌ పెట్టుకొని డబ్బులు సంపాదించవచ్చు- ఇలా అప్లై చేయండి


Shop On Railway Platform: ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌ల్లో ఇండియన్‌ రైల్వేస్‌ ఒకటి. మన దేశంలో ప్రతి రోజు రెండున్నర కోట్ల మందికి పైగా ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ. వేల సంఖ్యలోని భారతీయ రైళ్లు ప్రతి రోజు లక్షల కిలోమీటర్లను కవర్‌ చేస్తున్నాయి.  రైలు ప్రయాణంలో, ప్రయాణీకులకు కొన్ని అవసరాలు ఉంటాయి. అల్పాహారం, భోజనం, చిరుతిళ్లు, మంచినీళ్లు, ఇతర పానీయాల వంటి ఆహార పదార్థాల నుంచి కాలక్షేపం కోసం పుస్తకాల వరకు చాలా వాటిని ప్రయాణీకులు కొంటుంటారు. 

ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచన మీకు ఉంటే, భారతీయ రైల్వేలతో కలిపి పని చేసే అవకాశం మీకు లభిస్తుంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రైళ్లలో తిరిగే ప్రయాణీకుల నుంచి లక్షల రూపాయలు సంపాదించొచ్చు.

మనం ఏదైనా రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఫ్లాట్‌ఫామ్స్‌ మీద టీ, కాఫీ, ఫుడ్‌, బుక్స్‌, బొమ్మలు, ఇంకా చాలా ఉత్పత్తులను అమ్మే స్టాల్స్‌ను చూస్తుంటాం. ఏ సమయంలో చూసినా అవన్నీ బిజీగానే కనిపిస్తుంటాయి, వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. మీరు కూడా అలాంటి స్టాల్‌ తెరిచి మంచి ఆదాయం పొందొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా, రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణీకులు విమానాశ్రయాల వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిని మీరు అవకాశంగా మార్చుకోవచ్చు. కొన్ని సులభమైన స్టెప్స్‌ ఫాలో అయితే రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ మీద మీరు కూడా సొంతంగా ఒక షాప్‌ ఓపెన్‌ చేయవచ్చు. 

రైల్వే స్టేషన్‌లో షాప్‌ తెరవడానికి రైల్వే విభాగం టెండర్‌ జారీ చేస్తుంది. రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ మీద షాప్‌ ఓపెన్‌ చేయడానికి అవసరమైన పూర్తి ప్రక్రియ అందులో ఉంటుంది. టెండర్‌ వేసే వ్యక్తులు రైల్వే విభాగం సూచించిన విధానాన్ని అనుసరించాలి. ఆ తర్వాత రైల్వే అధికార్లు షాప్‌ ఓపెనింగ్‌ కోసం మీకు లైసెన్స్ జారీ చేస్తారు. లైసెన్స్‌ జారీ చేసే బాధ్యత IRCTC తీసుకుంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?
రైల్వే స్టేషన్‌లో షాప్‌ తెరవడానికి, ముందుగా భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ, టెండర్ ఆప్షన్‌లోకి వెళ్లి అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలి. అన్ని వివరాలను అర్థం చేసుకోవాలి. రైల్వే విభాగం సూచించిన అన్ని నిబంధనలను అనుసరించాలి.

షాప్‌ కోసం ఎంత అద్దె చెల్లించాలి?
రైల్వే స్టేషన్‌లో ఉన్న అన్ని షాప్‌లకు అద్దె ఒకేలా ఉండదు. రైల్వే స్టేషన్‌లోని ఏ ప్రదేశంలో షాప్‌ ఉంది, ఆ ప్రదేశం/ఫ్లాట్‌ఫామ్‌ ఎంత బిజీగా ఉంటుంది అనే విషయాల ఆధారంగా షాప్‌ అద్దె మారుతుంది. అంతేకాదు, షాప్‌ సైజ్‌, అందులో అమ్మే వస్తువులపైనా రెంట్‌ అమౌంట్‌ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా… టీ, కాఫీ, ఫుడ్ స్టాల్ వంటివాటి కోసం రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. IRCTC కార్పొరేట్ పోర్టల్‌లోని యాక్టివ్ టెండర్‌లో మాత్రమే షాప్‌ రెంట్‌ గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments