Stock Market News Today in Telugu: ఆటో, ఐటీ షేర్ల మూమెంట్ కారణంగా ఈ రోజు (మంగళవారం, 06 ఫిబ్రవరి 2024) స్టాక్ మార్కెట్ మంచి ఊపుతో ప్రారంభమైంది. మార్కెట్‌లో టాప్ గెయినర్స్‌లో ఉన్న భారతి ఎయిర్‌టెల్ దాదాపు 3 శాతం హై జంప్‌తో ప్రారంభం అయింది. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో ఐటీ షేర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
ఈ రోజు ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్ ప్రారంభమైంది, గురువారం ఉదయం సెషన్‌లో ఫలితాలు వెల్లడవుతాయి. రెపో రేట్ ఈసారి కూడా మారదని మార్కెట్ భావిస్తోంది. ఈ అంచనాకు విరుద్ధంగా వచ్చే నిర్ణయం గురువారం నాడు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (సోమవారం) 71,731 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు సెన్సెక్స్ 239.40 పాయింట్లు లేదా 0.33 శాతం జూమ్‌తో 71,970.82 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 21,772 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 53.50 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 21,812.75 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
వరుసగా 3 రోజుల లోయర్ సర్క్యూట్ నుంచి పేటీఎం షేర్లు ఈ రోజు కాస్త కోలుకున్నాయి, దిగువ స్థాయిలో రికవరీ కనిపించింది. ఉదయం 9.18 గంటలకు, పేటీఎం స్టాక్ 4.03 శాతం పతనంతో రూ. 420.85 వద్ద ఉంది. ఆ తర్వాత ఉదయం 9.57 గంటలకు 5.53 శాతం పెరుగుదలతో 462.75 స్థాయిలో కనిపించింది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.5 శాతం లాభపడ్డాయి.
సెన్సెక్స్ షేర్లు
ఓపెనింగ్ టైమ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 16 షేర్లు లాభాలతో ట్రేడవుతుండగా, 14 షేర్లు క్షీణతలో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో.. భారతి ఎయిర్‌టెల్ 2.77 శాతం, టీసీఎస్ 2.76 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.74 శాతం, విప్రో 2.24 శాతం, మారుతి 1.35 శాతం, టెక్ మహీంద్రా 1.23 శాతం చొప్పున గెయిన్ అయ్యాయి.
నిఫ్టీ షేర్లు
నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 32 షేర్లు గెయిన్స్‌లో ఉండగా, 18 షేర్లు లాస్‌లో ఉన్నాయి. నిఫ్టీలో ఐటీ స్టాక్స్ ఆధిపత్యం చూపుతున్నాయి. టీసీఎస్ 3.6 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.83 శాతం, విప్రో 2.57 శాతం వృద్ధితో టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఎయిర్‌టెల్ 2.53 శాతం, యుపీఎల్ 1.78 శాతం పెరిగాయి.
వరుసగా 3 రోజుల నిరంతర పతనం తర్వాత, ఈ రోజు, పేటీఎం షేర్ల లోయర్ సర్క్యూట్ ముగిసింది, దిగువ స్థాయుల్లో రికవరీ కనిపించింది. ఉదయం 9.18 గంటలకు 4.03 శాతం పతనంతో రూ. 420.85 వద్ద ట్రేడయిన పేటీఎం షేర్లు, ఉదయం 9.57 గంటలకు 5.53 శాతం పెరుగుదలతో 462.75 స్థాయిలో కనిపించాయి.
పేటీఎం వాలెట్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తుందన్న వార్తలతో నిన్న 14 శాతం పెరిగిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఈ రోజు క్షీణించాయి. పేటీఎం వాలెట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి ఎలాంటి చర్చలు జరపడం లేదని జియో ఫిన్ స్పష్టం చేయడమే దీనికి కారణం.
యాక్షన్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్, ఆగి గ్రీన్‌పాక్, అక్జో నోబెల్ ఇండియా, అనంత్ రాజ్, బిర్లా కార్పొరేషన్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, చంబల్ ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్, సిగ్నిటీ టెక్నాలజీస్, డాలర్ ఇండస్ట్రీస్, ఇ.ఐ.డి. ప్యారీ, EIH హోటల్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా, FIEM ఇండస్ట్రీస్, గో ఫ్యాషన్ (ఇండియా), గోద్రెజ్ ప్రాపర్టీస్, గోదావరి పవర్ & ఇస్పాత్, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హాకిన్స్ కుక్కర్స్, IOL కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్, J.B. కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, JK టైర్ అండ్ ఇండస్ట్రీస్, కింగ్‌ఫా సైన్స్ అండ్ టెక్నాలజీ, లెమన్ ట్రీ హోటల్స్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, నవిన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్, NLC ఇండియా, FSN ఈ-కామర్స్ వెంచర్స్, ప్రోక్టర్ & గాంబుల్ హెల్త్, PNC ఇన్‌ఫ్రాటెక్, రాడికో ఖైతాన్, రెడింగ్టన్, టిమ్‌కెన్ ఇండియా, ట్రైడెంట్, TTK ప్రెస్టీజ్, టాటా టెలిసర్వీసెస్, ఉషా మార్టిన్, వక్రాంగీ, వి-మార్ట్ రిటైల్, వెల్‌స్పన్ కార్ప్. కంపెనీలు ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ షేర్లన్నీ ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఈ రోజు ఉదయం 09.40 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 90.52 పాయింట్లు లేదా 0.13% పెరిగి 71,821.94 దగ్గర; NSE నిఫ్టీ 22.30 పాయింట్లు లేదా 0.10% పెరిగి 21,794 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
యూఎస్ మార్కెట్లు రెడ్‌లో క్లోజ్ కావడంతో, ఈ ఉదయం, ఆసియా మార్కెట్లలో నికాయ్, ASX 200, కోస్పి 0.5-0.8 శాతం వరకు పడిపోయాయి. హాంగ్ సెంగ్ 1 శాతానికి పైగా లాభంలో కదులుతోంది. నిన్న, US మార్కెట్లలో.. S&P 500 0.32 శాతం, డౌ జోన్స్ 0.71 శాతం, నాస్‌డాక్ 0.20 శాతం పడిపోయాయి. వడ్డీ రేట్ల నిర్ణయాన్ని బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈ రోజు ప్రకటిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.