Homeఆర్థికంఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌సహా 19 ప్రాంతాల్లో సోదాలు

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లో సరకులు అమ్మే సంస్థలపై ఈడీ ఫోకస్- హైదరాబాద్‌సహా 19 ప్రాంతాల్లో సోదాలు


Enforcement Directorate raided Amazon and Flipkart sellers offices : విదేశీ పెట్టుబడుల నిబంధనలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువు విక్రయించే వ్యాపార సంస్థలపై ఈడీ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 19 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, గురుగ్రామ్, పంచకులలోని 19 ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. 

ఓడరేవుల నుంచి కాకుండా వేరే వేర మార్గాల ద్వారా చైనా వస్తువులను తీసుకొచ్చి దేశంలో విక్రయిస్తున్నారని వారికి సమాచారం ఉంది. అందుకే ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఓడ రేవుల్లో భద్రత పటిష్టంగా ఉంటుందని ఎక్కువ సమయం పడుతుందని అందుకే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరకులను తీసుకొస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 

దీనిపై ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్టు, అమెజాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. తమకు రిలేటెడ్ సంస్థల్లో సోదాలు జరగనుందని అవి స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ వెబ్‌సైట్‌లలో కొందరు అమ్మకందారులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల ధరలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నాయి. ఇ-కామర్స్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఎలాంటి అనుమతి లేదు. మార్కెట్‌ ప్లేస్ మోడ్‌లో పని చేసే ఫ్లిప్‌కార్డు, అమెజాన్ సంస్థలు తమ వద్ద ఎలాంటి సరకును ఉంచుకోకుండా అమ్మకందారులకు ప్లాట్‌ఫామ్‌ సర్వీస్ మాత్రమే అందిస్తారు. 

Also Read: ట్రంప్‌ కంటే హారిస్‌ దగ్గరే ఎక్కువ సంపద – అంత డబ్బు ఎలా సంపాదించారు?

ఆఫ్‌లైన్ B2B స్టోర్‌ల్లో మాత్రం FDI అనుమతిస్తున్నారు. ఇక్కడ కూడా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి ఉంది. ఈ కామర్స్‌ సంస్థలు పెట్టుబడి పెట్టే విదేశీ సంస్థల్లో వాటాలు కలిగి ఉండకూడదు. ఇక్కడ అమ్మకందారుల వస్తువులు 25శాతానికి మించి స్టోర్ చేయడానికి వీలు లేదు. ఏమైనా డిస్కౌంట్లు ఉంటే నేరుగా ఎవరైతే అమ్మకందారులు ఉంటారో వాళ్లే ఇవ్వాలి కానీ ఈ కామర్స్‌ వాళ్లు కాదు. 

ఈ రూల్స్ అతిక్రమించి కొందరు అమ్మకందారులు ఇష్టారాజ్యాంగా చేస్తున్నారన్న ఆరోపణలపై ఈడీ తనిఖీలు చేసింది. అందులో భాగంగా ఆరుగురు విక్రయసంస్థల వద్ద కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఎప్పటి నుంచో ఈ సమస్యపై గళం ఎత్తుతున్న సిఎఐటి తనిఖీలను ఆహ్వానించింది. గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఇలాంటి అమ్మకందారులకు ఫైన్ ఎందుకు వేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ప్రజలకు నష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్న ఫ్లిప్‌కార్డు, అమెజాన్ కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ CCIలో CAIT, మెయిన్‌లైన్ మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ పిటిషన్లు వేశాయి. FDI ఉల్లంఘనలే కాకుండా, వ్యతిరేక పోటీ పద్ధతులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలని సీసీఐకి ఈడీని కోరారు. ఇలాంటి అనారోగ్యకరమైన పోటీ వల్ల చిన్న వ్యాపారాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. దీంతో ఈడీ రంగంలోకి దిగి అసలు గుట్టు రట్టు చేసే పనిలో పడింది. 

Also Read: బిలియన్ డాలర్ల ఆస్తులు, కోట్ల విలువైన కార్లు – డొనాల్డ్ ట్రంప్‌ సంపద ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments