Homeఆర్థికంపేమెంట్స్ బ్యాంక్‌పై మీ అన్ని అనుమానాలకు RBI సమాధానాలు, ఇదిగో FAQs లిస్ట్‌

పేమెంట్స్ బ్యాంక్‌పై మీ అన్ని అనుమానాలకు RBI సమాధానాలు, ఇదిగో FAQs లిస్ట్‌


RBI Releases FAQs On Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి, ఖాతాదార్లలో ఉన్న చాలా ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాధానాలు విడుదల చేసింది. ఈ FAQsను (Frequently Asked Questions) ఒకసారి పరిశీలిద్దాం. 29 ఫిబ్రవరి 2024 నుంచి వర్తించేలా పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలకు సంబంధించి, ఆర్‌బీఐ కొంత ఊరట ప్రకటించింది. ఆ గడువు తేదీని 15 మార్చి 2024 వరకు పొడిగించింది.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు – సమాధానాలు

ప్రశ్న – నాకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో సేవింగ్స్, కరెంట్ ఖాతా ఉంది. మార్చి 15 తర్వాత నేను డబ్బు విత్‌డ్రా చేయగలనా? బ్యాంకు నుంచి వచ్చిన డెబిట్ కార్డు ఏమవుతుంది?

సమాధానం: మార్చి 15 తర్వాత కూడా మీరు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్‌ను ఉపయోగించవచ్చు. ఖాతా ఖాళీ అయ్యే వరకు డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
 
ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్, కరెంట్ అకౌంట్‌కి డబ్బు డిపాజిట్ చేయవచ్చా లేదా బదిలీ చేయవచ్చా?

సమాధానం – మార్చి 15 తర్వాత డబ్బు డిపాజిట్ చేయలేరు.

ప్రశ్న – నా రీఫండ్ మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. ఇది ఆ ఖాతాలో జమ అవుతుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా రీఫండ్, క్యాష్‌బ్యాక్, వడ్డీ బ్యాంకు ఖాతాకు వస్తాయి. ఇతరుల నుంచి మాత్రం నగదును పొందలేరు. 

ప్రశ్న – స్వీప్ ఇన్/అవుట్ కింద భాగస్వామ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు ఏమవుతుంది?

సమాధానం: స్వీప్ ఇన్ సౌకర్యం మార్చి 15 వరకు కొనసాగుతుంది. మార్చి 15 తర్వాత డిపాజిట్ సౌకర్యం అందుబాటులో ఉండదు.

ప్రశ్న – నా జీతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. అదే ఖాతాలో జీతం వస్తుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత మీ జీతాన్ని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయలేరు. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మరొక ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలోకి సబ్సిడీ వస్తుందా?

సమాధానం – మార్చి 15 తర్వాత, సబ్సిడీ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు రాదు. ఈ అసౌకర్యాన్ని నివారించడానికి మరొక ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – నా కరెంటు బిల్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్‌ అవుతుంది. మార్చి 15 తర్వాత పరిస్థితి ఏంటి?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు జరుగుతుంది. ఖాతా ఖాళీ అయ్యాక ఇబ్బంది పడకుండా ఉండాలంటే వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – నా OTT సభ్యత్వం నెలవారీ చెల్లింపు పేటీఎం చెల్లింపుల బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్‌ అవుతుంది. మార్చి 15 తర్వాత పరిస్థితి ఏంటి?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ వరకు చెల్లింపు కొనసాగుతుంది. ఖాతా ఖాళీ అయ్యాక ఇబ్బంది పడకుండా ఉండాలంటే వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి ప్రతి నెలా నా లోన్ EMI ఆటోమేటిక్ చెల్లింపు జరుగుతుంది. ఇప్పుడు అతను ఏం చేయాలి?

సమాధానం – మార్చి 15 తర్వాత కూడా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ వరకు EMI చెల్లింపు కొనసాగుతుంది. మార్చి 15 తర్వాత, ఆ ఖాతాలో డబ్బు జమ చేయలేరు. అందువల్ల, అసౌకర్యాన్ని నివారించడానికి, వేరే ఖాతాను ఉపయోగించండి.

ప్రశ్న – నా లోన్ EMI చెల్లింపు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా ఇతర బ్యాంక్‌లోని నా ఖాతా ద్వారా ఆటోమేటిక్‌గా డెబిట్‌ జరుగుతుంది. ఇది కొనసాగించవచ్చా?

సమాధానం – అవును, EMI చెల్లింపును పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ నుంచి కాకుండా మరే ఇతర బ్యాంక్‌ ఖాతా నుంచైనా కొనసాగించవచ్చు.

ప్రశ్న – నా వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. దీనిని ఉపయోగించవచ్చా?

సమాధానం – అవును, మార్చి 15 తర్వాత కూడా, వాలెట్‌ ఖాళీ అయ్యే వరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. డబ్బు బదిలీ చేయడానికి మార్చి 15 లోపు దీనిని ఉపయోగించవచ్చు.

ప్రశ్న – నా వాలెట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో ఉంది. దానిని టాప్ అప్ చేయవచ్చా? వేరొకరి నుంచి ఈ వాలెట్‌లోకి డబ్బు డిపాజిట్ చేయవచ్చా?

సమాధానం – లేదు, క్యాష్‌బ్యాక్, రీఫండ్ మాత్రమే వస్తాయి. ఇది కాకుండా, ఇది ఏ విధంగానూ టాప్ అప్ చేయడం కదరదు.

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌లో క్యాష్‌బ్యాక్ రాబోతోంది. మార్చి 15 తర్వాత అయినా వస్తాయా?

సమాధానం – అవును, మార్చి 15 తర్వాత కూడా క్యాష్‌ బ్యాక్, రీఫండ్ వస్తాయి.

ప్రశ్న – పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్‌ని మూసివేసిన తర్వాత, మిగిలిన బ్యాలెన్స్‌ని ఏదైనా ఇతర బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చా?

సమాధానం – అవును, మీరు ఫుల్‌ KYC వాలెట్‌ను మూసేసి, ఆ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. మినిమమ్‌ KYC వాలెట్ డబ్బును ఉపయోగించవచ్చు.

మరో ఆసక్తికర కథనం: పేటీఎం నోడల్ ఖాతా యాక్సిస్ బ్యాంక్‌కు మార్పు – పేమెంట్లకు ఇబ్బంది ఉండదు!



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments