Homeఆర్థికంనూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!

నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ – అన్నీ హ్యాపీ న్యూస్‌లే!


New Facilities For PF Account Holders In 2025: కొత్త సంవత్సరంలో, ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (Employees’ Provident Fund Organisation – EPFO), ఉద్యోగుల సౌకర్యాలను పెంచబోతోంది. ఈపీఎఫ్‌ (EPF) ఖాతాదార్ల ఆసక్తికి అనుగుణంగా రూల్స్‌లో కొన్ని మార్పులు చేయనుంది. ఈపీఎఫ్‌ కాంట్రిబ్యూటర్లను సంతోషపెట్టే ఫెసిలిటీస్‌ అందించనుంది. ఈ మార్పుల ఉద్దేశ్యం, పీఎఫ్‌ ఖాతాదారులు వారి పెన్షన్ నిధులను సమయానుకూలంగా & సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూడడం.

ఎదురుచూపులు ఉండవు, ATM నుంచి డబ్బు తీసుకోవచ్చు             
PF నిబంధనలలో కొత్త మార్పుల ప్రకారం, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వారి పెన్షన్ మొత్తం కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. EPFO, పీఎఫ్‌ కాంట్రిబ్యూటర్లు అందరికీ ATM కార్డ్‌ తరహా కార్డ్‌లను అందించబోతోంది. మీరు ATM కార్డ్‌ను ఉపయోగించి మీ బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బును తీసుకున్నట్లే, PF కార్డ్‌తో ఏదైనా ATMకి వెళ్లి పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం 2025లో అందుబాటులోకి వస్తుంది.

ప్రతి నెలా రూ.15 వేలకు పైగా పీఎఫ్ ఖాతాలో జమ చేసుకోవచ్చు           
ప్రస్తుతం, ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో (బేసిక్‌ పే + DA) 12 శాతానికి సమానమైన మొత్తాన్ని పీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న రూల్‌ ప్రకారం, పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తం నెలకు రూ. 15,000కు మించకూడదు. ఇటీవల చేసిన మార్పు ప్రకారం ఈ గరిష్ట పరిమితిని తీసేశారు. ఉద్యోగుల మూల వేతనానికి బదులు, వాస్తవ జీతం ఆధారంగా పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత, ఉద్యోగులు పెద్ద మొత్తంలో ఈపీఎఫ్‌ ఖాతాలో డిపాజిట్ చేయడానికి వీలవుతుంది. తద్వారా, పదవీ విరమణ సమయానికిపెద్ద మొత్తంలో సంపద పోగుపడుతుంది, మరింత ఎక్కువ పెన్షన్ పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్స్‌లో వచ్చిన 10 ప్రధాన మార్పులు 

EPFO వ్యవస్థల ఉన్నతీకరణ                          
ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO), తన IT మౌలిక సదుపాయాలను కూడా అప్‌గ్రేడ్ చేయబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే, చాలా పనులు మానవ ప్రమేయం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా జరిగిపోతాయి. అంతేకాదు, భవిష్య నిధి ఖాతాదారుల క్లెయిమ్‌లు పరిష్కారం మరింత వేగం పుంజుకుంటుంది, వాళ్లకు త్వరగా డబ్బులు అందుతాయి.

ఈక్విటీల్లో పెట్టుబడులు             
EPFO, ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడానికి కొత్త అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. దీనివల్ల, పీఎఫ్ ఖాతాదారులు ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో కాకుండా నేరుగా ఈక్విటీల్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు పెరుగుతాయా, గుడ్‌ న్యూస్‌ వింటామా? 



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments