Homeఆర్థికంత్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్

త్రిష ఇంట విషాదం… క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్


Trisha announces break from work after her pet dog Zorro dies on Christmas 2024: సౌత్ క్వీన్, స్టార్ హీరోయిన్ త్రిష‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఈ రోజు… క్రిస్మస్ పండక్కి… ఆమె ఇంట ఒక జీవి తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. దాంతో త్రిష ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో తన పరిస్థితిని అభిమానులు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. 

త్రిష పెంపుడు శనకం జోరో మృతి
Trisha pet dog Zorro death: త్రిష గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆమెకు మూగ జీవాలు అంటే ఎంత ప్రేమ అనేది తెలుస్తుంది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రిష పెట్ లవర్. అంతే కాదు… పెట్ మదర్ కూడా! ఆవిడ దగ్గర పెంపుడు జంతువులు ఉన్నాయి.‌ ఆ జంతువులలో ఒకటి ఈ రోజు తుది శ్వాస విడిచింది.


తన పెంపుడు శనకం జోరో క్రిస్మస్ రోజు ఉదయం మృతి చెందిన‌ సంగతిని త్రిష సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ”నా గురించి తెలిసిన వారందరికీ ఇక నుంచి నా జీవితం హీరో అనే సంగతి ఈజీగా తెలుస్తుంది. నాతో పాటు మా కుటుంబం అంతా విషాదంలో మునిగింది. మేమంతా షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. కొన్ని రోజులు వర్క్ నుంచి బ్రేక్ తీసుకుంటాను. మీ అందరికీ దూరంగా ఉంటాను” అని త్రిష పేర్కొన్నారు. జోరో ఫోటోలను సోషల్ మీడియాలో ఆవిడ షేర్ చేశారు.
 
Also Readబరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా – ఎలా ఉందంటే?


ఆల్మోస్ట్ అర డజను సినిమాలు చేస్తున్న త్రిష
Trisha Upcoming Movies: త్రిష చేస్తున్న సినిమాల విషయానికి‌ వస్తే… ప్రస్తుతం ఆమె చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్న తమిళ సినిమా ‘విడా మయూర్చి’లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన ఆవిడ నటించారు. అది కాకుండా అజిత్ మరో సినిమా ‘గుడ్ బాడ్ అగ్లీ’లో కూడా ఆవిడ నటించారు.

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమాలోనూ త్రిష నటించారు. ‘స్టాలిన్’ సినిమా తర్వాత చిరు, త్రిష కాంబినేషన్ రిపీట్ కావడం ఇదే. ఆల్మోస్ట్ 13 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేశారు. తమిళంలో ఇంకా కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’… మలయాళంలో ‘ఐడెంటిటీ’, ‘రామ్’ అనే సినిమాలు త్రిష చేస్తున్నారు.

Also Readబేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా – దళపతి విజయ్ ‘తెరి’ బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments