Reliance Jio : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో ఆధిపత్యం చెలాయిస్తోంది. వైర్‌లైన్ టెలికాం రంగం (AP టెలికాం సర్కిల్) అక్టోబర్ 2024లో గణనీయమైన వృద్ధిని సాధించింది. అందులో ముఖ్యంగా రిలయన్స్ జియో అగ్రగామిగా నిలిచింది. నెల నెలా కస్టమర్లను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తోన్న జియో.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదేలే అన్నట్టు దూసుకెళ్తోంది. 69,930 కొత్త కనెక్షన్‌లు వచ్చినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెలియజేసింది.
జియో వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్ సెప్టెంబర్ 2024లో 17,49,696 నుంచి అక్టోబర్ 2024లో 18,19,626కి పెరిగింది. అలా ఒక్క నెలలోనే 4% వృద్ధిని సాధించింది. అత్యంత డైనమిక్ AP టెలికాం సర్కిల్‌లోని కస్టమర్‌లను ఆకర్షించడానికి జియో దూకుడు వ్యూహం, అత్యాధునిక సాంకేతికత, పోటీ ధరలు చాలా ఉపయోగపడిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
వైర్‌లైన్ మార్కెట్‌లో కమాండింగ్ వాటా
రిలయన్స్ జియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వైర్‌లైన్ మార్కెట్‌లో కమాండింగ్ వాటాను కలిగి ఉంది. మార్కెట్ లీడర్‌గా దాని స్థానాన్ని బలోపేతం చేస్తుంది. కంపెనీ పనితీరు అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడమే కాకుండా బలమైన కనెక్టివిటీ సొల్యూషన్స్, నమ్మకమైన సర్వీస్ క్వాలిటీతో విభిన్న కస్టమర్ అవసరాలను తీర్చగల సామర్థ్యాన్ని కూడా హైలైట్ చేస్తుంది.
ఇతర కంపెనీల విషయానికొస్తే..
అదే నెలలో, భారతీ ఎయిర్‌టెల్ 15,655 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను ఆకర్షించింది. వొడాఫోన్ ఐడియా దాని వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ బేస్‌లో క్షీణతను చవిచూసింది. దీంతో కంపెనీ సంఖ్యలు సెప్టెంబర్ 2024లో 1,03,875 నుంచి అక్టోబర్ 2024 నాటికి 92,835కి పడిపోయాయి. ఫలితంగా 11,040 మంది సబ్‌స్క్రైబర్‌లు నష్టపోయిది.
కస్టమర్లకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. జియో రీఛార్జ్ రేట్లను తగ్గించేందుకు అడుగులు వేసింది. ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయిన వారిని తిరిగి రప్పించేందుకు, ఉన్న కస్టమర్లు కాపాడుకునేందుకు అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. జియో 6 నెలల(200 రోజులు)కు గానూ రూ.2025 రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఇలా జియో తన 49 కోట్ల మంది కస్టమర్లకు నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. 200 రోజులకుగానూ రూ.2025 రీఛార్జ్‌తో అపరిమిత కాల్స్, 500 జీబీ హై-స్పీడ్ డేటాతో రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ 200 రోజుల చెల్లుబాటుతో ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దాంతో పాటు రోజుకు 100 ఉచిత SMSలు పొందుతారు. అలా ఆరు నెలల కాలానికి 500 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
వండర్ ల్యాండ్ లో ఉత్సవాలు
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈఎస్ఏ ప్రోగ్రాంలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని దాదాపు వెయ్యి మంది చిన్నారులతో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ కహానీ, కాలా, ఖుషీ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించింది.
మరిన్ని చూడండి