Homeఆర్థికండేటా అవసరం లేని వాళ్లకు గుడ్ న్యూస్ -త్వరలోనే వాయిస్ కాల్స్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లు

డేటా అవసరం లేని వాళ్లకు గుడ్ న్యూస్ -త్వరలోనే వాయిస్ కాల్స్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లు


Special Recharge For Voice Calls : దేశంలో వాయిస్ కాల్స్ కోసం రిచార్జ్ చేసే పని లేకుండా పోయింది. అన్నింటినీ కలిపి డేటా ప్లాన్‌లో కలిపేశారు. ఈ డేటా తీసుకుంటే చాలా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీ అని చెబుతున్నారు. మరి డేటా ఉపయోగించని వారి పరిస్థితి ఏంటీ. అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్త ప్లాన్‌లు తీసుకురావాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 

చాలా మంది రెండు మూడు సిమ్‌లు వాడుతుంటారు. అందులో డేటా అవసరం లేకపోయినా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ఆ సిమ్‌లు ఉంచాల్సిన పరిస్థితి వస్తోంది. కానీ వాటికే చెల్లిస్తామంటే టెలికాం కంపెనీలు ఊరుకోవు. మీరు ఏం చేసినా ఆ నెంబర్ మెంటైన్ చేయాలంటే కచ్చితంగా 200రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సిందే అంటూ దోచేస్తున్నాయి. 

ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు ట్రాయ్‌ టెలికాం కంపెనీలకు గట్టిగానే ఆదేశాలు జారీ చేసింది. డేటా అవసరం లేని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం కచ్చితంగా వాయిస్, మెసేజ్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. దీని వల్ల డేటా అవసరం లేని వృద్ధులు, ఫీచర్ ఫోన్లు వాడే వ్యక్తులు, రెండు మూడు సిమ్‌లు కలిగి ఉన్న వాళ్లకు ఇది బాగా యూజ్ అవుతుంది. 

Also Read: సైబర్ నేరాల కట్టడికి కొత్త టెక్నిక్.. ఎలా సేవ్ కావాలో కాలర్ ట్యూన్ చెప్తుందట

డేటా లేకుంటే తక్కువ ధరకే రీచార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులోకి వస్తాయని వినియోగదారులు ఆశపడుతున్నారు. డేటా అవసరం లేని వాళ్లంతా ప్రతి నెల తిట్టుకొని రీచార్జ్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. మరోవైపు ఇప్పటి వరకు స్పెషల్ రీచార్జ్ కూపన్‌లను 90 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. దాన్ని ఏడాదికి పొడిగించింది. దీంతో పదే పదే రీఛార్జ్ చేసే ఇబ్బంది తప్పుతుందని కూడా వినియోగదారులు సంబరపడిపోతున్నారు.  

సైబర్ నేరాగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ట్రాయ్ సిద్ధమైంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గతంలో కరోనా వ్యాప్తి చెందుతున్న టైంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసినట్టుగానే మరో ప్రయత్నం చేస్తోంది. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఓ ప్రత్యేక కాలర్ ట్యూన్‌ను రెడీ చేసింది. సెలెక్టెడ్ మోడ్‌లో దీన్ని అవతలి వాళ్లకు వినిపించనుంది. ఇందులో ఎలాంటి నేరాలు జరగవచ్చో చెప్పడమే కాకుండా వాటిని నుంచి తప్పించుకునే మార్గాలను కూడా తెలియజేయనుంది. 

దీన్ని వీలైనంత త్వరగా ఆచరణలోకి తీసుకురావాలని ట్రాయ్ యోచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే టెలికాం కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. ఒకట్రెండు రోజుల్లో ఇది అమల్లోకి రానుంది.  కరోనా టైంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుక అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌తో వ్యాది తీవ్రతను తెలియజేశారు. ఏం చేయాలో వివరించారు. ప్రజలకు ధైర్యం చెబుతూనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల్లో భయం కలిగించకుండా అవగాహన కల్పించేందుకు ట్రై చేస్తున్నారు. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు.. ఆ కేటగిరీలో తగ్గేదేలే, మరి ఎయిర్‌టెల్‌ పరిస్థితి ఏంటీ?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments