Homeఆర్థికంకేంద్ర బడ్జెట్ 2025 - పలు రంగాల్లో జీఎస్టీ రేట్లపై అంచనాలు, భారత ఆర్థిక వ్యవస్థపై...

కేంద్ర బడ్జెట్ 2025 – పలు రంగాల్లో జీఎస్టీ రేట్లపై అంచనాలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం


Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ప్రణాళికాబద్దమైన కార్యక్రమాలను వెల్లడిస్తారని అందరూ భావిస్తున్నారు. అత్యంత ఎక్కువ మంది ఆసక్తి చూపుతోంది జీఎస్టీ మార్పులపైనే. ప్రతీసారి జీఎస్టీ పన్నుల్లో పలు మార్పులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వచ్చే సంవత్సరానికి గానూ కేంద్రం ఎలాంటి మార్పులు చేయనుంది, ఏయే రంగాలపై ఎంత పన్ను విధించనుంది అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈసారి బడ్జెట్‌లో సామాన్యులకు ఊరటనిచ్చే చాలా అంశాలు ఉండొచ్చని ఆర్ధిక విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ తర్వాత బంగారు ఆభరణాలు మరింత చౌకగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని టాక్ నడుస్తోంది. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025ని ఫిబ్రవరి 1, 2025 శనివారం ఉదయం 11:00 గంటలకు సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌పై పేద, మధ్యతరగతి వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.

పునరుత్పాదక రంగం

భారతదేశం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంపై నిరంతరం కృషి చేయాలి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి స్థిరమైన, సరసమైన ఇంధన సరఫరాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. 2070 నాటికి నికర సున్నాని సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల, స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించడానికి, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ఇంధన రంగంలో సంస్కరణలు చేయడం చాలా అవసరం. ఈ విషయంలో, సోలార్ ప్యానెల్స్, సెల్స్ తయారీకి ఇన్‌పుట్‌లు, క్యాపిటల్ గూడ్స్‌పై జీఎస్‌టీ రేట్లపై అనేక మినహాయింపులు ఇప్పటికే అనుమతి పొందాయి. అలాగే, సోలార్ ప్యానెల్‌లు, సెల్‌ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట ఇన్‌పుట్‌ల దిగుమతిపై విధించే కస్టమ్స్ సుంకం నుండి మార్చి 2026 వరకు ప్రభుత్వం మినహాయింపును అందించింది.

కంపెనీలు ఈ లావాదేవీలను సమర్ధవంతంగా రూపొందించేందుకు వీలుగా, సోలార్ ప్రాజెక్ట్ ఖర్చులు లేదా ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణ (EPC) సేవలపై వర్తించే జీఎస్టీని సరళీకృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం, పునరుత్పాదక శక్తి సంబంధిత ఈపీసీ ప్రాజెక్ట్‌లపై జీఎస్టీ వరుసగా వస్తువులు, సేవలకు 70:30 నిష్పత్తిలో చెల్లించవచ్చు. ఇందులో వస్తువులపై 12 శాతం, సేవలపై 18 శాతం రేటు వర్తిస్తుంది. అయినప్పటికీ, వివిధ వస్తువులపై వర్తించే మినహాయింపుల కారణంగా, వస్తువులు, సేవల కోసం పలు ప్రత్యేక ఒప్పందాలను కలిగి ఉండాలా లేదా నేరుగా ఈపీసీ మోడల్‌కు వెళ్లాలా అనే ఖర్చు-సమర్థవంతమైన పరిష్కారాన్ని కనుగొనడంపై కంపెనీలు పోరాడుతున్నాయి.  

హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం కీలక సంస్కరణలు

ఇటీవలి కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. దీనికి మరో ప్రత్యామ్నాయం హైబ్రిడ్ వెహికిల్స్. ఇవి తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను రిలీజ్ చేస్తాయి. ఇంధన సామర్థ్యాన్ని పెంచుతాయి.  తద్వారా ముడి చమురు దిగుమతుల ఖర్చు కూడా తగ్గుతుంది. అందువల్ల ఈ సారి బడ్జెట్ లో హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించి భారతీయ వినియోగదారులకు మరింత సరసమైన ధరల్లో లభించేలా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది కేవలం వినియోగదారులనే కాదు.. అధునాతన హైబ్రిడ్ టెక్నాలజీల పరిశోధన, ఆవిష్కరణలలో పెట్టుబడి పెట్టేందుకు వాహన తయారీదారులను ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ప్రస్తుతం, భారతదేశంలో హైబ్రిడ్ వాహనాలపై 28 శాతం అంటే అధిక పన్ను రేటును విధిస్తోంది కేంద్రం. వాస్తవానికి ఇది ఎలక్ర్టిక్ వాహనాల కంటే ఎక్కువ. కానీ ఈ సారి ప్రవేశపెట్టే బడ్జెట్ లో జీఎస్టీ రేటును తగ్గించనున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు వారి వర్కింగ్ క్యాపిటల్‌ను అన్‌బ్లాక్ చేసే, నగదు ప్రవాహాలను మెరుగుపరిచే రీఫండ్ విధానాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించి, వేగవంతం చేయనుందని భావిస్తున్నారు.

పన్ను ఎగవేతలపై చర్యలు

ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టనున్నారు. సప్లై చైన్ ద్వారా వస్తువులను గుర్తించడం, ట్రాక్ చేయడం కోసం ట్రాక్ అండ్ ట్రేస్ అనే మెకానిజంను అమలు చేసి పన్ను ఎగవేత, లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్‌వాయిస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IMS)కి సంబంధించి చట్టంలో ఓ సవరణ ఇప్పటికే ప్రతిపాదించారు. ఐఎంఎస్(IMS)తో కలిపి ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజమ్‌ని అమలు చేయడం వల్ల ఆదాయ లీకేజీలను కాపాడవచ్చు. ఇది పన్ను వసూళ్లను బలోపేతం చేస్తుంది, మోసపూరిత కార్యకలాపాలను సులభంగా గుర్తించడానికి వీలవుతుంది.

రిటైల్ రంగం 

వ్యక్తిగత సంరక్షణ వస్తువులు, ప్యాక్ చేసిన ఆహారాలు వంటి భారీ-వినియోగ ఎఫ్ఎంసీజీ (FMCG) ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను సాధారణ ప్రజల అవసరాలకు సరిపోయేలా తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇది ఈ వస్తువుల అమ్మకాలు, ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా అధిక పన్ను వసూళ్లకు దారి తీస్తుంది. ఇది ప్రభుత్వం సమ్మిళిత వృద్ధి అనే ఎజెండాతో కూడి ఉంటుంది. ఇది ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు అవసరమైన ఉత్పత్తులు సమాజంలోని అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా చేస్తుంది.

వీటితో పాటు ఆటో విడిభాగాలు, బంగారు ఆభరణాలపై జీఎస్టీ రేటులో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్పు చేయనున్నారనే ప్రచారం నడుస్తోంది. పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేసేందుకు పలు ఆవిష్కరణలు, కొత్త పన్ను రేట్లు తీసుకురానున్నారని సమాచారం.

Also Read: MOEF: ఎంవోఈఎఫ్‌లో అసోసియేట్ పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments