Homeఆర్థికంకాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు- రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న బుగ్గన

కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు- రేపు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న బుగ్గన


Ap Assembly Budget Session 2024 :  శాసనసభ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గటలకు గవర్నర్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌ ఉభయ సభలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా వేస్తారు. ఈ వెంటనే శాసనసభాపతి తమ్మినేని సీతారాం నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి సభా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఇవ్వాలని ఈ సమావేశంలో టీడీపీ పట్టుబట్టే అవకాశముంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని పట్టుబట్టేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాంపైనా చర్చ జరగనుంది. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి మృతి పట్ల శాసనమండలిలో సభ్యులు సమావేశమై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన అకౌంట్‌ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనమండలిలో గతేడాది మాదిరిగానే ఉపముఖ్యమంత్రి అంజాద్‌ భాషా రప్రవేశపెట్టే అవకాశముంది. 

ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ప్రతిపక్షం

రాష్ట్రంలోని పది కీలకమైన ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా ఉంది. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో.. ప్రజా సమస్యలపై బలంగా తమ వాణిని వినిపించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నాయకులకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రోజూ నిరసన తెలుపుతూ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపారు. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం అనేక రంగాల్లో విఫలమైందని, వీటిని అసెంబ్లీలో లేవనెత్తేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments