ICICI Bank Cuts Credit Card Benefits: ఐసీఐసీఐ బ్యాంక్, తన క్రెడిట్ కార్డ్ కస్టమర్లు గట్టి షాక్ ఇచ్చింది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ల మీద ప్రస్తుతం ఉన్న ప్రయోజనాల్లో కోత పెట్టింది. ఈ మార్పులు దశలవారీగా అమలవుతాయి.
తన క్రెడిట్ కార్డ్‌ల మీద, డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజు (Dynamic currency conversion fee on ICICI bank credit cards)తో పాటు వర్తించే టాక్స్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ వసూలు చేయబోతంది. ఇది, వచ్చే నెల నుంచి అంటే 2024 ఫిబ్రవరి 01 నుంచి అమల్లోకి వస్తుంది. ఇండియాలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్న భారతీయులు, వాటితో విదేశాల్లో లావాదేవీలు జరిపితే డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజు + టాక్స్ పడుతుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే… ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో విదేశాల్లో ఏం కొన్నా, చెల్లించినా అదనపు ఛార్జీల బాదుడును భరించాలి.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి చేసే అద్దె చెల్లింపు, ఈ-వ్యాలెట్ లోడింగ్‌పై ఇప్పటి వరకు అందిస్తున్న రివార్డ్ పాయింట్లను (Reward Points on ICICI Credit Card Payments) బ్యాంక్ నిలిపేస్తోంది, ఈ రూల్ కూడా ఫిబ్రవరి 01 నుంచి అమలవుతుంది. ఐసీఐసీఐ అమెజాన్ క్రెడిట్ కార్డ్‌కు (ICICI Amazon Credit Card) మాత్రం మినహాయింపును ప్రసాదించింది.
యుటిలిటీ పేమెంట్స్ (Utility Payments with ICICI Credit Card) నుంచి స్టాంప్ డ్యూటీ, ఇన్‌కమ్ ట్యాక్స్ పేమెంట్ వంటి ప్రభుత్వ సంబంధిత చెల్లింపులను తొలగించింది. మిగిలిన యుటిలిటీ చెల్లింపులు, వాటిపై వచ్చే రివార్డ్ పాయింట్లు గతంలాగే ఉంటాయి. ఈ మార్పు కూడా ఫిబ్రవరి 01 నుంచి అమలువుతంది.
ఏప్రిల్ నుంచి అమలయ్యే కీలక మార్పు ఇది
డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ రూల్స్‌లోనూ ఐసీఐసీఐ బ్యాంక్ (Domestic Airport Lounge Access with ICICI Bank Credit Card) మార్పులు చేసింది. లాంజ్ యాక్సెస్ కోసం, క్రెడిట్ కార్డ్‌పై కనీస వ్యయ పరిమితి, రివార్డు పాయింట్లను మార్చింది. మొత్తం 21 రకాల క్రెడిట్ కార్డులను ఈ లిస్ట్‌లోకి చేర్చింది.
ఈ 21 రకాల క్రెడిట్ కార్డుల్లో ఏదైనా మీ దగ్గర ఉంటే, ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక త్రైమాసికంలో రూ.35 వేలకు తగ్గకుండా ఖర్చు చేస్తేనే డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లోకి యాక్సెస్ లభిస్తుంది. జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.35 వేలకు తగ్గకుండా ఖర్చు చేస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాంజ్ యాక్సెస్ దొరుకుతుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కనీసం రూ.35 వేలు ఖర్చు చేస్తే జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాక్సెస్ లభిస్తుంది. ఏప్రిల్ 01 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది, ఇకపై ఇలాగే కొనసాగుతుంది.
డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం కనీస వ్యయ పరిమితి పెరిగిన క్రెడిట్ కార్డ్‌లు:
ICICI కోరల్ క్రెడిట్ కార్డ్
ICICI కోరల్ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్
ICICI బ్యాంక్ NRI కోరల్ క్రెడిట్ కార్డ్
ICICI బ్యాంక్ NRI సెక్యూర్డ్ కోరల్ క్రెడిట్ కార్డ్
ICICI కోరల్ రూపే క్రెడిట్ కార్డ్
ICICI సెక్యూర్డ్ కోరల్ క్రెడిట్ కార్డ్
ICICI కోరల్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డ్
ICICI మాస్టర్ కార్డ్ కోరల్ క్రెడిట్ కార్డ్
ICICI బ్యాంక్ లీడ్ ద న్యూ కోరల్ క్రెడిట్ కార్డ్
ICICI బ్యాంక్ ఎక్స్‌ప్రెషన్ క్రెడిట్ కార్డ్
మైన్ క్రెడిట్ కార్డ్ – ICICI బ్యాంక్ విసా కార్డ్
మైన్ క్రెడిట్ కార్డ్ – ICICI బ్యాంక్ మాస్టర్ కార్డ్
ICICI HPCL సూపర్ సేవర్ విసా క్రెడిట్ కార్డ్
ICICI HPCL సూపర్ సేవర్ మాస్టర్ క్రెడిట్ కార్డ్
ICICI మేక్ మై ట్రిప్ మాస్టర్ బిజినెస్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్
ICICI మేక్ మై ట్రిప్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్
ICICI మాంచెస్టర్ యునైటెడ్ ప్లాటినమ్ క్రెడిట్ కార్డ్
చెన్నై సూపర్ కింగ్స్ ICICI క్రెడిట్ కార్డ్
స్పీడ్జ్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్
ICICI పరాక్రమ్ సెలక్ట్ క్రెడిట్ కార్డ్
ICICI బిజినెస్ బ్లూ అడ్వాంటేజ్ కార్డ్
మరో ఆసక్తికర కథనం: రూ.2,000 నోట్లను ఇంకా మార్చుకోలేదా?, కొత్త ప్రకటన చేసిన ఆర్‌బీఐ