Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే గడువు వేగంగా సమీపిస్తోంది. జులై 31, 2024తో లాస్ట్ డేట్ ముగుస్తుంది. ప్రస్తుతం, మన దేశంలో పాత పన్ను విధానం (Old Tax Regime), కొత్త పన్ను విధానం (New Tax Regime) అమల్లో ఉన్నాయి. టాక్స్ స్లాబ్ రేట్లు ఈ రెండింటికీ వేర్వేరుగా ఉంటాయి.
సెక్షన్ 115BAC కింద, పాత పన్ను విధానానికి ప్రత్యామ్నాయంగా కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త పన్ను విధానంలో ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR 2024-25) ఫైల్ చేయాలా, వద్దా అన్నది పన్ను చెల్లింపుదారు ఇష్టం. నాలుగేళ్ల క్రితం, 2020 ఏప్రిల్ 01వ తేదీ (FY 2020-21) నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చింది. వ్యక్తులు (Individual Taxpayers), హిందు అవిభాజ్య కుటుంబాల (HUF) కోసం తొలుత కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఆదాయ పన్ను చెల్లింపుల్లో సౌలభ్యాన్ని పెంచడం, మరో ఆప్షన్‌ను అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం.
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా మారింది. అంటే… ఏ పన్ను పాలనలో ఉండాలో ముందుగానే నిర్ణయించుకోకపోతే, ఆటోమేటిక్‌గా కొత్త విధానం వర్తిస్తుంది. పాత విధానంలో ఉండాలని టాక్స్‌పేయర్ భావిస్తే, ఆ విషయం గురించి కంపెనీ యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇవ్వాలి.
AY 2024-25 కోసం, కొత్త పన్ను విధానంలో అమల్లో ఉన్న టాక్స్ శ్లాబ్‌లు:
సవరించిన పన్నులు, రాయితీ రేట్లతో కొత్త పన్ను విధానాన్ని డిజైన్ చేశారు. కాబట్టి, ఈ పన్ను పాలన వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (AOPలు) సహా అన్ని వర్గాలకు ఒకేరకంగా వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో HRA, LTA, సెక్షన్ 80C, సెక్షన్ 80D వంటి మినహాయింపు క్లెయిమ్‌లు చెల్లవు.
రూ. 3 లక్షల వరకు —– పన్ను లేదు
రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు —– రూ. 3,00,000 దాటిన ఆదాయంపై 5% పన్ను
రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు —– రూ. 15,000 + రూ. 6,00,000 దాటిన ఆదాయంపై 10% పన్ను
రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు —– రూ 45,000 + రూ. 9,00,000 దాటిన ఆదాయంపై 15% పన్ను
రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు —– రూ. 90,000 + రూ. 12,00,000 దాటిన ఆదాయంపై 20% పన్ను
రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే —– రూ. 1,50,000 + రూ. 15,00,000 కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను
AY 2024-25 కోసం, కొత్త పన్ను విధానంలో అమల్లో ఉన్న టాక్స్ శ్లాబ్‌లు:
పాత పన్ను విధానంలో టాక్స్ పేయర్లకు చాలా పన్ను మినహాయింపులు, తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. HRA, LTA, సెక్షన్‌లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) సహా చాలా మినహాయింపులను ఈ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
—– రూ. 2.50 లక్షల వరకు ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు
—– రూ. 2.50 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను
—– రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయంపై 20% పన్ను
—– రూ. 10 లక్షలు దాటిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాలి.
మరో ఆసక్తికర కథనం: హిందుజా కుటుంబ సభ్యులకు నాలుగేళ్ల జైలు – పనివాళ్లను వేధించిన ఫలితం