Stock Market Today, 06 December 2023: ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం (RBI MPC Meeting) ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. దీంతో పాటు గ్లోబల్ క్యూస్ కూడా ఇండియన్ మార్కెట్లకు ఈ రోజు (బుధవారం) దిశానిర్దేశం చేస్తాయి.
గ్లోబల్ మార్కెట్లు
నిన్న US మార్కెట్లు మిక్స్‌డ్‌గా క్లోజ్ అయినప్పటికీ, ఈ రోజు ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాలోని కీలక సూచీలు 0.5 శాతం నుంచి 1.5 శాతం వరకు పెరిగాయి.
మంగళవారం, వాల్ స్ట్రీట్‌లో, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, S&P 500 వరుసగా 0.22 శాతం, 0.06 శాతం పడిపోయాయి. వీటికి విరుద్ధంగా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.31 శాతం లాభపడింది.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 32 పాయింట్లు లేదా 0.15% గ్రీన్ కలర్‌లో 21,036 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాటిజివ్‌గా అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
కెనరా బ్యాంక్: జాతీయ మీడియా కథనాలను బట్టి, టైర్-1 బాండ్ల ద్వారా రూ. 3,500 కోట్ల వరకు సమీకరించాలని కెనరా బ్యాంక్ భావిస్తోంది.
పతంజలి ఫుడ్స్: మసాలా వ్యాపారంలో రూ.1,000 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. బిస్కెట్లు, వంట నూనెలు తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు పతంజలి ఫుడ్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబా రామ్‌దేవ్ చెప్పారు. దీనివల్ల ఆదాయ వృద్ధితో పాటు లాభాలు కూడా పెరుగుతాయన్నారు.
జీ లెర్న్: జీ లెర్న్ పూర్తి-యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన డిజిటల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. ఈ కంపెనీపై యాక్సిస్ బ్యాంక్ దివాలా పరిష్కార పిటిషన్ వేసింది.
స్టేట్ బ్యాంక్: SBIPFPLలో SBICAPSకు ఉన్న 20% వాటాను SBI కొనుగోలు చేసేందుకు బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ (ECCB) ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది ఆమోదం తెలిపింది.
సోమాని సెరామిక్స్: షేర్ బైబ్యాక్ కోసం రికార్డ్ తేదీగా డిసెంబర్ 15, 2023ను (శుక్రవారం) కంపెనీ నిర్ణయించబడింది.
HDFC బ్యాంక్: బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEOగా శశిధర్ జగదీషన్‌ను కంటిన్యూ చేయడానికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వి శ్రీనివాస రంగన్ నియామకం కోసం వాటాదార్ల నుంచి ఆమోదం కోరింది.
కజారియా సెరామిక్స్: నేపాల్‌లోని కజారియా రమేష్ టైల్స్ లిమిటెడ్ (జాయింట్ వెంచర్ కంపెనీ), నేపాల్‌లో ఒక ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు అక్కడి బ్యాంకుల కన్సార్టియం రూ.218 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది.
పవర్ గ్రిడ్ కార్ప్: గుజరాత్‌లో ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది.
SBC ఎక్స్‌పోర్ట్స్: 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
యూకో బ్యాంక్: ఈ కంపెనీలో ఇటీవల జరిగిన IMPS తప్పిదం కేసుకు సంబంధించి, 13 ప్రదేశాల్లో CBI సోదాలు నిర్వహించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.