Income Tax Saving Fixed Deposit Schemes: ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి (ITR for FY 2023-24/AY 2024-25) టాక్స్‌పేయర్లు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎంత ఆదాయ పన్ను (Income Tax) చెల్లించాల్సి వస్తుందని లెక్కలు వేస్తున్నారు, పన్ను ఆదా చేసే మార్గాల కోసం వెదుకుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఆదాయ పన్నును ఆదా చేయడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FDs) ఒక మంచి ఆప్షన్‌గా చూడవచ్చు. ఈ పథకాల్లో ఇన్వెస్టర్లకు పన్ను ఆదా మాత్రమే కాకుండా, ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం, పెట్టుబడులకు సంపూర్ణ రక్షణ లభిస్తాయి.
“టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్”లో పెట్టుబడి పెట్టే డబ్బుకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C (Section 80C of the Income Tax Act) కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. అధిక ఒడుదొడుకులు ఉండే ఈక్విటీలు సహా ఇతర రిస్కీ ఆప్షన్‌ల కంటే ‘పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు’ సురక్షితమైనవి. ఈ FD పథకాలపై, వివిధ బ్యాంక్‌లు మంచి వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి.
‘పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల’ను ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌లు (Banks offering ‘Tax Saving Fixed Deposit Schemes’)
DCB బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్
యాక్సిస్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్
ఇండస్‌ఇండ్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్
యెస్ బ్యాంక్ లిమిటెడ్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్
HDFC బ్యాంక్ పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్
ICICI బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్
IDFC ఫస్ట్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్
బ్యాంక్ ఆఫ్ బరోడా పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్
ఎంత పన్ను ఆదా చేయవచ్చు?
పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ సెక్షన్ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఇది వర్తించదు.
ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. ఈ గడవుకు ముందే వెనక్కు తీసుకోవడానికి వీలుండదు. ఈ తరహా డిపాజిట్ల మీద బ్యాంక్ లోన్ (Bank Loan on Tax Saving Fixed Deposits) తీసుకోవడానికి కూడా వీలుండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80TTB కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో, ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీపై రూ. 50,000 వరకు పన్ను రాయితీని సీనియర్ సిటిజన్లు పొందవచ్చు.
ఆదాయ పన్ను ఆదా చేయడానికి 31 మార్చి 2024 వరకే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: వీసా లేకుండా 62 దేశాలు చుట్టిరావొచ్చు, ఇండియన్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు