Multibagger Stocks 2024: 2024 సంవత్సరంలో స్టాక్ మార్కెట్‌లో రోలర్ కోస్టర్ రైడ్ నడిచింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ, ఈ సంవత్సరం కొన్ని స్టాక్స్ కూడా సూపర్ స్టార్స్‌గా మారాయి, వాటి పెట్టుబడిదారులకు తారస్థాయి లాభాలు అందించాయి. 2024లో, అంటే, ఒక్క సంవత్సరంలోనే ఇన్వెస్టర్లకు వేల రెట్లు రాబడిని అందించిన కొన్ని మల్టీబ్యాగర్ షేర్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
1. ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (Elcid Investments)
ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్టాక్, 2024 మల్టీబ్యాగర్స్ లిస్ట్‌లో మొదటి స్థానంలో ఉంది. ఈ షేర్లు, ఒక సంవత్సరంలో దాని పెట్టుబడిదారులకు 5,470,154.96 రెట్ల ( ఇది అచ్చు తప్పు కాదు, నిజం) రాబడిని ఇచ్చాయి. 2024 జూన్ 21న, ఈ కంపెనీ ఒక షేరు ధర రూ. 3.53గా ఉంది. ఇది, నవంబర్ 08, 2024న రూ. 3,30,473.35కి పెరిగింది (ఇది కూడా అచ్చు తప్పు కాదు). అంటే, మీరు జూన్ 21, 2024న ఈ షేర్‌లో రూ.35 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే, కేవలం 6 నెలల్లోనే ఆ డబ్బు రూ.3,300 కోట్లుగా మారి ఉంటుంది.
2. శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ ఎన్‌టీఆర్‌కే లిమిటెడ్ (Sri Adhikari Brothers Televisn Ntwrk Ltd)
ఆల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ కూడా పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. డిసెంబర్ 04, 2023న, శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ ఒక షేరు ధర రూ. 1.60 పైసలు. 24 డిసెంబర్ 2024న, ఒక షేరు ధర రూ. 1,814.00. దీని ఆల్ టైమ్ హై 2,219.95 రూపాయలు. ఒక ఇన్వెస్టర్ డిసెంబర్ 04, 2023న ఈ షేర్‌లో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, 24 డిసెంబర్ 2024న అతని డబ్బు రూ. 2,896,000 అవుతుంది. అంటే, కేవలం ఒక్క సంవత్సరంలో 72,460 శాతం రాబడి.
మరికొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్
ఈ సంవత్సరం, నిఫ్టీ 500 ఇండెక్స్‌లోని 33 స్టాక్స్ అద్భుతంగా పని చేశాయి, తమ ఇన్వెస్టర్లకు 100% నుంచి 320% వరకు తిరిగి అందించాయి. ఈ కంపెనీలు రియల్ ఎస్టేట్, EMS, పవర్, క్యాపిటల్ గూడ్స్ వంటి వివిధ రంగాల్లో పని చేస్తున్నాయి.
ఈ జాబితాలో, GE వెర్నోవా T&D ఇండియా (GE Vernova T&D India) పేరు ముందంజలో ఉంది, ఇది 2024లో 320.70% లాభాన్ని సాధించింది. 2023లో ఈ కంపెనీ 336% వృద్ధిని నమోదు చేసింది. దీని తర్వాత జ్యోతి CNC ఆటోమేషన్ (Jyoti CNC Automation) ఉంది. లిస్టింగ్ తర్వాత, ఈ స్టాక్ నిరంతరం పెరుగుతూనే ఉంది, ఒక్కో షేర్ రూ. 434 నుంచి రూ. 1,331కు చేరి 302% పెరిగింది.
కేఫిన్ టెక్నాలజీస్ (Kfin Technologies) కూడా స్టాక్ మార్కెట్‌లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ కంపెనీ షేరు రూ. 485 నుంచి రూ. 1,444కి పెరిగింది, పెట్టుబడిదారులకు 197% లాభాన్ని సంపాదించి పెట్టింది.
2024లో, కేన్స్ టెక్నాలజీ ఇండియా (Kaynes Technology India) 180%, డిక్సన్ టెక్నాలజీస్ (Dixon Technologie) 175% రాబడిని అందించాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కొత్త సంవత్సరంలో గ్యాస్ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు