Rules in EPF : రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ – ఈపీఎఫ్ఓ (EPFO) తమ సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రెండు కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఈపీఎఫ్ఓతో లింక్ చేయబడి ఉన్న 7.6 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చనున్నాయి. ఇప్పుడు సభ్యులు యజమాని ద్వారా ఎటువంటి ధృవీకరణ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండానే మీ పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్(Online)లో ఈజీగా మార్చుకోవచ్చు. అంతేకాదు, ఈ -కేవైసీ (e-KYC) ఈపీఎఫ్ ఖాతాలు (ఆధార్ సీడెడ్) కలిగిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులు తమ ఈపీఎఫ్ బదిలీ క్లెయిమ్స్ ను ఆన్‌లైన్‌లో ఆధార్ ఓటీపీ (OTP) (One-time password)తో యజమాని జోక్యం లేకుండానే నేరుగా ఫైల్ చేయవచ్చు. ఈ రెండు కొత్త సర్వీస్ లను కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ మరింత సులువువవుతుందని, యజమానులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పారు.
తాజా సౌకర్యాలతో కలిగే ప్రయోజనాలు
- అక్టోబర్ 1, 2017 తర్వాత జారీ అయిన యూఏఎన్ చందాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. వీరు ఏవైనా మార్పులు చేయాలనుకుంటే ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం ఉండదు.
- ఈపీఎఫ్ఓ మెంబర్స్ కు సంబంధించిన పేరు, పుట్టిన తేదీ, లింగం, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు లాంటి వివరాలను మార్చుకోవడం సులభమవుతుంది.
- ఆధార్ తో లింక్ చేయని యూఏఎన్ ఖాతాల విషయంలోనూ మార్పులు చేయాలనుకుంటే మాత్రం యజమానికి ఫిజికల్ డాక్యుమెంట్స్ సమర్పించాక.. వెరిఫికేషన్ పూర్తి చేసి ఈపీఎఫ్ఓ ఆమోదం కోసం పంపాలి.
- అక్టోబర్ 1, 2017 కంటే ముందు జారీ అయిన అయిన యూఏఎన్ చందాదారులు తమ వివరాలను మార్చుకునేందుకు ఈపీఎఫ్ ఆమోదం అవసరం లేకుండానే ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఇందుకు అవసరమైన డాక్యుమెంట్లను సైతం తగ్గించారు.
EPFO పోర్టల్‌లో EPF UANని ఆధార్‌తో ఎలా లింక్ చేయాలంటే:
- ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ – సేవ (e-Sewa) వెబ్‌సైట్‌ను సందర్శించాలి
- మీ యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా ఉపయోగించి లాగిన్ చేయాలి.
- ‘Manage’ మెనులో, ‘KYC’ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- కేవైసీ (KYC) పేజీలో, ఆధార్ ను ఎంచుకోవాలి.
- మీ ఆధార్ కార్డ్(Adhar Card)లో ఉన్న మీ 12 అంకెల ఆధార్ నంబర్, పేరు(Name)ను నమోదు చేయాలి.
- ధృవీకరణ కోసం సమాచారాన్ని సబ్మిట్(Submit) చేయడానికి ‘save’పై క్లిక్ చేయాలి.
- మీ వివరాలును ఉడాయ్ (UIDAI) తమ రికార్డులతో క్రాస్-చెక్ చేస్తుంది.
- సబ్మిట్ సక్సెస్ అయిన తర్వాత, మీ ఆధార్ మీ ఈపీఎఫ్(EPF) ఖాతాకు విజయవంతంగా లింక్ అవుతుంది.
మరిన్ని చూడండి