“బెంగళూరు ప్రజలకు బిగ్ అప్డేట్! నగరంలో యూఎస్ కాన్సులేట్ ప్రారంభానికి జనవరిలో డేట్ ఫిక్స్ అయ్యింది. భారత ఐటీ క్యాపిటల్‌గా, దేశ ఐటీ రెవెన్యూలో 40శాతం వాటా కలిగి ఉన్న బెంగళూరుకు ఇంతకాలం యూఎస్ కాన్సులేట్ లేదు. ఫలితంగా వీసా పని కోసం ఇక్కడి ప్రజలు చెన్నై లేదా హైదరాబాద్‌కి వెళ్లాల్సి వస్తోంది. నగరానికి ఎంపీ అయిన తర్వాత బెంగళూరులో యూఎస్ కాన్సులేట్‌ని తీసుకురావడాన్ని మిషన్‌గా పెట్టుకున్నాను. 2020లో అమెరికా అధికారులతో ఇదే విషయాన్ని చర్చించాను. ప్రధాని నరేంద్ర మోదీ 2023లో అమెరికాకు వెళ్లినప్పుడు, ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇక ఇప్పుడు యూఎస్ కాన్సులేట్ కల సాకారం కానుంది. ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్ పూర్తవుతుండటం చాలా థ్రిల్లింగా ఉంది,” అని బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్ చేశారు.