సెప్టెంబర్ లో పరీక్షలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ సంవత్సరం సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 24 వరకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మెయిన్ (UPSC CSE Mains Result 2023) పరీక్షలను నిర్వహించింది. సివిల్ సర్వీసెస్, 2023 ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ రాయడానికి అర్హత కలిగి ఉంటారు. ఇప్పడు మెయిన్స్ లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. “యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2023 ఫలితాల ఆధారంగా, క్రింద ఇచ్చిన రోల్ నంబర్లు, పేరు ఉన్న అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర సెంట్రల్ సర్వీసెస్ (గ్రూప్ ‘ఎ’ మరియు గ్రూప్ ‘బి’) లకు ఎంపిక చేయడానికి పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు హాజరు కావాల్సి ఉంటుంది” అని యూపీఎస్సీ నోటిఫికేషన్ వివరించింది.