బ్లాక్ మెయిల్, దోపిడీ
ఆ తరువాత ఆ ఇంటిమేట్ వీడియోలను సోషల్ మీడియా (social media) ఖాతాలలో పోస్ట్ చేస్తానని మోహన్ కుమార్ ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఆలా చేయకుండా ఉండాలంటే, తన బ్యాంక్ ఖాతాకు పెద్ద మొత్తాలలో డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేశాడు. భయపడిపోయిన ఆ యువతి పలు దఫాలుగా అతడి అకౌంట్లలోకి డబ్బు జమ చేసింది. మొత్తంగా బాధితురాలు తన అమ్మమ్మ బ్యాంకు ఖాతా నుంచి రూ.1.25 కోట్లు అతడికి బదిలీ చేసింది. అంతేకాదు, పలుమార్లు రూ.1.32 కోట్ల మేరకు నగదును కూడా ఇచ్చింది. మోహన్ కుమార్ దురాశ డబ్బుతో ఆగలేదు. ఖరీదైన నగలు, గడియారాలు, హైఎండ్ కారును ఇవ్వాలని ఆ యువతిని బలవంతం చేశాడు.