27 People Died In Hathras Stampede In Satsang In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా తోపులాట జరగ్గా పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో 15 మంది మహిళలు, చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని చూడండి