G20 Summit 2023:
రెండ్రోజుల సదస్సు ముగింపు..
రెండు రోజుల G20 సదస్సుని ముగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచానికి కొత్త దిశ చూపించడానికి ఇదే సరైన సమయం అని తొలి రోజు సదస్సులో వెల్లడించిన ఆయన ఆ తరవాత పలు కీలక అంశాలపై ప్రపంచాధినేతలతో చర్చించారు. ముఖ్యంగా జియో పొలిటికల్ వివాదాలపై చర్చలు జరిపారు. One Earth,One Family,One Future థీమ్‌తో మూడు సెషన్స్‌లో భేటీలు జరిగాయి. ఈ సదస్సుని ముగిస్తూ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌గి గ్యావెల్ అందించారు ప్రధాని. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో G20 సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. ఈ సదస్సుకి వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్‌లో వర్చువల్ G20 సమావేశాలు జరపనున్నట్టు ప్రకటించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ “శాంతి కోసం ప్రార్థిద్దాం” అని ప్రతిపాదించారు.
“G20 సదస్సు ముగిసింది. One Earth,One Family,One Future థీమ్‌తో జరిగిన ఈ చర్చలు బాగా జరిగాయనే అనుకుంటున్నాను. సభ్యులందరికీ కృతజ్ఞతలు. నవంబర్ వరకూ G20 బాధ్యతలు తీసుకుంటాం. ఈ సదస్సులో జరిగిన చర్చలపై వర్చువల్‌గా రివ్యూ చేయాలని ప్రతిపాదిస్తున్నాను”
– ప్రధాని నరేంద్ర మోదీ
నవంబర్‌లో వర్చువల్ రివ్యూ
గత రెండు రోజుల్లో ప్రపంచ దేశాధినేతలంతా ఎన్నో విలువైన సూచనలు ఇచ్చారని, మరి కొందరు కీలక ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారని వెల్లడించారు ప్రధాని. ఈ సలహాలను రివ్యూ చేసుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని స్పష్టం చేశారు.
“రెండు రోజుల ఈ సదస్సులో కీలక నేతలు కొన్ని విలువైన సూచనలు చేశారు. మరి కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలూ తీసుకొచ్చారు. వీటన్నింటినీ పున:సమీక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత మాపై ఉన్నాయి. ఈ సదస్సులో చర్చించిన అంశాలపై వర్చువల్‌గా రివ్యూ చేసుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. నవంబర్‌లో ఈ వర్చువల్ భేటీ చేయాలని భారత్ ప్రతిపాదిస్తోంది”
– ప్రధాని నరేంద్ర మోదీ
2024లో G20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనున్న బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్‌కి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా లూయిజ్