Homeఅంతర్జాతీయంవామ్మో ఈమె మామూలు మహిళ కాదు - పెళ్లి చేసుకుంటుంది తర్వాత దోచేస్తుంది

వామ్మో ఈమె మామూలు మహిళ కాదు – పెళ్లి చేసుకుంటుంది తర్వాత దోచేస్తుంది


UP Police Arrested Eternal Bride: ఒంటరి పురుషులే ఆమె టార్గెట్. ఓ ముఠాగా ఏర్పడి వారికి గాలం వేస్తుంది. చిక్కుకున్న వారిని పెళ్లి చేసుకుంటుంది. తనే సర్వస్వం అని నమ్మిస్తుంది. కొద్దిరోజులు కాపురం చేసిన అనంతరం నగలు, డబ్బు తీసుకుని ఉడాయిస్తుంది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురిని తన టాలెంట్‌తో మోసం చేసింది. ఎట్టకేలకు ఏడో వ్యక్తిని సైతం మోసం చేసేందుకు యత్నించగా అనుమానంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్య పెళ్లి కూతురి వ్యవహారం బట్టబయలైంది. టీమ్‌తో సహా నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూనమ్, సంజనా గుప్తా, విమలేశ్ శర్మ, ధర్మేంద్ర ప్రజాపతి వీరంతా ఓ టీమ్. వీరిలో పెళ్లికూతురు పూనమ్, సంజనా ఆమె తల్లి. మిగిలిన ఇద్దరు సంబంధాల కోసం వెతుకుతారు. వీరు పెళ్లి కోసం ఎదురు చూసే ఒంటరి పురుషులు ఎక్కడ దొరుకుతారా.? అని టార్గెట్ చేస్తారు. అలాంటి వారికి గాలం వేసి అమ్మాయిని చూపిస్తామని.. అందుకు రూ.1.50 లక్షలు ఫీజుగా చెల్లించాలని అంటారు. అవతలి వారు అందుకు ఒప్పుకోగానే పూనమ్, సంజనల వద్దకు తీసుకెళ్తారు. వారు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తారు.

అదును చూసి..

పెళ్లైన అనంతరం పూనమ్ పెళ్లికొడుకుతో అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ అవకాశం ఉండే వరకూ అతనితో కాపురం చేస్తుంది. అవకాశం చిక్కగానే ఇంట్లో దొరికిన నగలు, డబ్బు తీసుకుని పరారవుతుంది. ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్‌ బాందా జిల్లాకు చెందిన శంకర్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని సదరు ముఠా టార్గెట్ చేసింది. సంజన, పూనమ్ తీరుపై అనుమానం రావడంతో.. రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో పూనమ్ ముఠా అతన్ని బెదిరించింది. తప్పుడు కేసు పెట్టి జైల్లో వేయిస్తామని హెచ్చరించింది. దీంతో తనకు ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పి అతను అక్కడి నుంచి బయటపడ్డాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

Also Read: VRS For Wife: విధి అంటే ఇదేనేమో! – అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments