Homeఅంతర్జాతీయంరోడ్డుపై అమ్మాయిల కోట్లాట వీడియో వైరల్, భాయ్ ఫ్రెండ్ కోసమేనంటోన్న నెటిజన్స్

రోడ్డుపై అమ్మాయిల కోట్లాట వీడియో వైరల్, భాయ్ ఫ్రెండ్ కోసమేనంటోన్న నెటిజన్స్


Viral Video : దేశంలో రోజూ ఏదొ ఒకచోట వింత వింత ఘటనలు, షాక్ కు గురి చేసే సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా బీహార్ లో. ఈ రాష్ట్రం ఎప్పుడూ ఏదో ఒక వార్తతో ట్రెండింగ్ లో ఊంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తో హల్ చల్ చేస్తోంది. ముజఫర్‌పూర్‌లో రోడ్డుపై ఇద్దరు యువతులు తీవ్రంగా కొట్టుకుంటున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆ ఇద్దరు అమ్మాయిలు మార్గమధ్యంలో ఒకరితో ఒకరు గొడవపడటం కనిపిస్తుంది. ఈ సమయంలోనే వీరి గొడవను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇదిప్పుడు వైరల్ అవుతోంది. 

ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వైరల్‌ వీడియోలో ఒకరిపై ఒకరు చెప్పులు విసిరుకునేంత స్థాయికి గొడవ జరిగింది. ముజఫర్‌పూర్ నగరంలోని కాజీమొహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పవర్ హౌస్ నుంచి సర్క్యూట్ హౌస్ రోడ్‌లో ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాయ్‌ఫ్రెండ్ కోసం అమ్మాయిలిద్దరూ ఇలా మార్గమధ్యలో గొడవ పడ్డారని పలువురు చెబుతున్నారు. 

ఇంతలోనే ఈ గొడవను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అమ్మాయిలు గొడవ చేయడం ప్రారంభించినప్పుడు, అక్కడ ప్రజలు గుమిగూడారని సమీపంలోని దుకాణదారులు చెప్పారు. అక్కడ ఉన్న ఒక అబ్బాయి ఆ అమ్మాయిలను విడదీయడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయినప్పటికీ వారు గొడవను కొనసాగించడం వీడియోలో చూడవచ్చు.

అమ్మాయిల ఫైట్ చూసిన సామాన్యులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇది పరిమితికి మించిపోయిందని అంటున్నారు. వీడియో చూసిన తర్వాత కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై కాజీమహమ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రాజ్‌కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఈ విషయమై ఎవరి నుంచీ ఫిర్యాదు అందలేదన్నారు.

ఇదే తరహాలో డెహ్రాడూన్‌లోని రాయ్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు యువతుల మధ్య గొడవ జరిగింది. రీసెంట్ గా జరిగిన ఈఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అమ్మాయిలిద్దరూ రోడ్డుపై ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం కనిపించింది. వారిద్దరూ తమ బాయ్ ఫ్రెండ్ కోసం గొడవ పడ్డట్టు తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్న  వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకట్టు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం చూడవచ్చు. రోడ్డుపై చెంపదెబ్బ కొట్టడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. పక్కనే ఉన్న వ్యక్తులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారిద్దరూ తమ గొడవను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని వినోదం అని పిలుస్తుంటే మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.


మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments